ఆ నిర్మాతలతో అలాంటి చేదు అనుభవం.. పెదవి విప్పిన తాప్సీ పన్ను
సినీ పరిశ్రమలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆలరిస్తున్న అందాల భామ తాప్సీ పన్నుకు ఆరంభంలో అనేక చేదు అనుభవాలను చవి చూసింది. తన కెరీర్‌కు అండగా ఉంటాయని భావించిన సినిమాల్లో నుంచి తొలగించడం ఆమెను షాక్ గురి చేశాయి. ఈ సందర్బంలో ఓ చిత్రం నుంచి ఉన్నపళంగా తీసి వేయడంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హసీన్ దిల్‌రుబా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ..

టాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించి...
వాస్తవానికి తాప్సీ నట జీవితం తెలుగు పరిశ్రమతోనే ప్రారంభమైంది. ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్‌ను ఆరంభించి.. మిస్టర్ పర్‌ఫెక్ట్, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, సాహసం లాంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత చష్మే బద్దూర్, బేబీ సినిమాతో హిందీలోకి ప్రవేశించారు. అయితే పతి పత్ని ఔర్ ఓ సినిమా ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారింది.

నాకు అలాంటి చేదు అనుభవం
అప్పట్లో పతి పత్ని ఔర్ ఓ చిత్రం సందర్భంగా నాకు అలాంటి చేదు అనుభవం ఎదురైంది నిజమే. అయితే షూటింగుకు వెళ్లక ముందే నాకు అలాంటి సంఘటన ఎదురైంది. దర్శక, నిర్మాతలు డేట్స్ తీసుకొన్నారు. కానీ చెప్పా పెట్టకుండా తీసేవారు. దాంతో కొంత నిరాశకు గురయ్యాను. ఈ విషయమంతా మీడియా ద్వారానే నాకు తెలిసింది. నిర్మాతలు నాకు నేరుగా చెప్పకపోవడం మరింత నిరాశను కలిగించింది అని తాప్సీ పేర్కొన్నారు.

సారీ చెప్పమని నిర్మాతలు ఒత్తిడి
తనను సినిమా నుంచి తొలగించిన విషయాన్ని మీడియాతో మాట్లాడినప్పుడు .. నిర్మాతలు నాకు కాల్ చేశారు. నన్ను కలిసి క్షమాపణ అడిగారు. మీడియాలో అలా ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీశారు. నేను మీడియాలో స్పందించిన దానికి సారీ చెప్పాలని పట్టుబట్టారు. అయితే వారు నన్ను ఎందుకు తొలగించారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయారు అని తాప్సీ తెలిపారు.

కారణం చెప్పమని నిలదీశా
అయితే నేను నిర్మాతలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించాను. వారిని కారణమేమిటో చెప్పమని నేను నిలదీశాను. కానీ వారు నాకు ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ సందర్భంగా వాళ్లు డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు. దాంతో నాకు సంతృప్తి కలుగలేదు అని తాప్సీ పేర్కొన్నారు.

తాప్సీ పన్ను సినీ కెరీర్ ఇలా...
గతేడాది తప్పడ్ సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకొన్న తాప్సీ పన్ను.. తాజాగా హసీన్ దిల్‌రుబా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం జూలై 1వ తేదీన రిలీజ్ కానున్నది. తమిళంలో జనగణమన, రష్మీ రాకెట్, లూప్ లపేటా, అన్నబెల్లె సుబ్రమణ్యం, దొబారా, ఏలియన్, క్రికెటర్ మితాలీ బయోపిక్ శబాష్ మితూ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











