For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ నిర్మాతలతో అలాంటి చేదు అనుభవం.. పెదవి విప్పిన తాప్సీ పన్ను

  |

  సినీ పరిశ్రమలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆలరిస్తున్న అందాల భామ తాప్సీ పన్నుకు ఆరంభంలో అనేక చేదు అనుభవాలను చవి చూసింది. తన కెరీర్‌కు అండగా ఉంటాయని భావించిన సినిమాల్లో నుంచి తొలగించడం ఆమెను షాక్ గురి చేశాయి. ఈ సందర్బంలో ఓ చిత్రం నుంచి ఉన్నపళంగా తీసి వేయడంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హసీన్ దిల్‌రుబా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ..

  హాట్ హాట్‌గా ఫర్నాజ్ శెట్టి.. ఇందువదనగా బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్‌తో శృంగారం

  టాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించి...

  టాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించి...

  వాస్తవానికి తాప్సీ నట జీవితం తెలుగు పరిశ్రమతోనే ప్రారంభమైంది. ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్‌ను ఆరంభించి.. మిస్టర్ పర్‌ఫెక్ట్, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, సాహసం లాంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత చష్మే బద్దూర్, బేబీ సినిమాతో హిందీలోకి ప్రవేశించారు. అయితే పతి పత్ని ఔర్ ఓ సినిమా ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారింది.

  ఖుషి కపూర్ అందాల ధగధగ.. వెండితెరపైకి రాకముందే అదిరిపోయేలా

  నాకు అలాంటి చేదు అనుభవం

  నాకు అలాంటి చేదు అనుభవం

  అప్పట్లో పతి పత్ని ఔర్ ఓ చిత్రం సందర్భంగా నాకు అలాంటి చేదు అనుభవం ఎదురైంది నిజమే. అయితే షూటింగుకు వెళ్లక ముందే నాకు అలాంటి సంఘటన ఎదురైంది. దర్శక, నిర్మాతలు డేట్స్ తీసుకొన్నారు. కానీ చెప్పా పెట్టకుండా తీసేవారు. దాంతో కొంత నిరాశకు గురయ్యాను. ఈ విషయమంతా మీడియా ద్వారానే నాకు తెలిసింది. నిర్మాతలు నాకు నేరుగా చెప్పకపోవడం మరింత నిరాశను కలిగించింది అని తాప్సీ పేర్కొన్నారు.

  ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నాభా నటేష్ హాట్ లుక్స్.. ఎలాంటి స్టిల్ ఇచ్చినా అదే ఘాటు

  సారీ చెప్పమని నిర్మాతలు ఒత్తిడి

  సారీ చెప్పమని నిర్మాతలు ఒత్తిడి

  తనను సినిమా నుంచి తొలగించిన విషయాన్ని మీడియాతో మాట్లాడినప్పుడు .. నిర్మాతలు నాకు కాల్ చేశారు. నన్ను కలిసి క్షమాపణ అడిగారు. మీడియాలో అలా ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీశారు. నేను మీడియాలో స్పందించిన దానికి సారీ చెప్పాలని పట్టుబట్టారు. అయితే వారు నన్ను ఎందుకు తొలగించారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయారు అని తాప్సీ తెలిపారు.

  బీచ్ లో బికినీతో టాలీవుడ్ హీరోయిన్ రచ్చ.. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా హాట్ ట్రీట్!

  కారణం చెప్పమని నిలదీశా

  కారణం చెప్పమని నిలదీశా

  అయితే నేను నిర్మాతలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించాను. వారిని కారణమేమిటో చెప్పమని నేను నిలదీశాను. కానీ వారు నాకు ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ సందర్భంగా వాళ్లు డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు. దాంతో నాకు సంతృప్తి కలుగలేదు అని తాప్సీ పేర్కొన్నారు.

  షర్ట్ విప్పేసి ప్యాంట్ జిప్ తీసేసి పాయల్ రాజ్‌పుత్ రచ్చ.. రెచ్చిపోయిన హీరోయిన్

  తాప్సీ పన్ను సినీ కెరీర్ ఇలా...

  తాప్సీ పన్ను సినీ కెరీర్ ఇలా...

  గతేడాది తప్పడ్ సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకొన్న తాప్సీ పన్ను.. తాజాగా హసీన్ దిల్‌రుబా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం జూలై 1వ తేదీన రిలీజ్ కానున్నది. తమిళంలో జనగణమన, రష్మీ రాకెట్, లూప్ లపేటా, అన్నబెల్లె సుబ్రమణ్యం, దొబారా, ఏలియన్, క్రికెటర్ మితాలీ బయోపిక్ శబాష్ మితూ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

  English summary
  Bollywood actress Taapsee Pannu's reveals Pati Patini Aur producers attitude on Haseen Dilruba promotions. She recollected rejection of Pati Patini Aur days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X