భర్తతో మాత్రమే కాదు చాలామంది అబ్బాయిలతో ఆ పని చేశా... బాంబ్ పేల్చిన తాప్సీ

నటి తాప్సీ పన్ను ఎట్టకేలకు డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోతో తన ప్రేమకథ గురించి వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయపూర్‌లో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మథియాస్‌తో ఎలా ప్రేమలో పడ్డానో చెప్పుకొచ్చింది. అంతేకాదు అతన్ని సెలెక్ట్ చేసుకోవడాని కంటే ముందే చాలామంది అబ్బాయిలతో ఆ పని చేశాను అంటూ బాంబ్ పేల్చింది. మరి ఈ బ్యూటీ లవ్ స్టోరీపై ఓ లుక్కేద్దాం.

షారూఖ్ ఖాన్‌తో కలిసి 'డుంకీ'లో చివరిసారిగా కనిపించిన తాప్సీ మథియాస్‌తో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. తానే లైఫ్ పార్టనర్ అని అన్పించే వరకు ఆమె బోను కలుస్తూనే ఉందట. బోతో లవ్ స్టోరీ గురించి తాప్సీ మాట్లాడుతూ "అతను అథ్లెట్, ఒలింపిక్స్‌లో మొదట గెలిచిన వ్యక్తి అని నేను అనుకున్నాను. సగం పని అక్కడే పూర్తయింది" అని నవ్వుతూ చెప్పింది.

Taapsee Pannu Says It Was Not Love-at-first-sight With Mathias Boe

తమ దేశం కోసం ఆడే అథ్లెట్లను చూసి విస్మయంగా అన్పిస్తుంది. ప్రభావితం కాకుండా తీవ్ర ఒత్తిడిలో ఆడడం అంటే మామూలు విషయం కాదు. అయితే మాది మొదటి చూపులో ప్రేమ వంటిది కాదు. నేను అతన్ని పరీక్షించడానికి సమయం తీసుకున్నాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య బంధం సాధ్యమేనా? వర్కౌట్ అవుతుందా? అనేది చాలా ముఖ్యమైన విషయం" అని తెలిపింది తాప్సీ.

మథియాస్‌పై తనకు ఎప్పుడూ అభిమానం , గౌరవం ఉన్నప్పటికీ అతనితో ప్రేమలో పడేందుకు సమయం తీసుకున్నట్లు వెల్లడించింది తాప్సీ. తాప్సీ ఇంకా మాట్లాడుతూ "నేను అతనిని కలిసినప్పుడు స్పెషల్ గా అనిపించింది. నేను అతని కంటే ముందు చాలా మంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను. కానీ ఇంతకు ముందు ఎవరితోనూ డేటింగ్ చేయని వ్యక్తి బోని కలిశాను. కాబట్టి మెచ్యూరిటీతో పాటు కొన్ని అనుమానాలు ఉండేవి. అతన్ని కలిసిన చాలా రోజుల తరువాత క్లారిటీ వచ్చింది. తనే నా సోల్ మేట్ అని నేను ఫిక్స్ అయ్యాను అంటూ తన లవ్ స్టోరీ గురించి ఎట్టకేలకు బయట పెట్టింది.

Taapsee Pannu Says It Was Not Love-at-first-sight With Mathias Boe

తాప్సీ, మథియాస్ మార్చి 23న ఉదయపూర్‌లో ప్రైవేట్ గా వివాహ వేడుకను జరుపుకున్నారు. ఈ పార్టీకి ఇరువురి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇక తాప్సీ సినిమాల విషయానికొస్తే ఆమె చేతిలో 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా', 'వో లడ్కీ హై ఖాన్', 'ఖేల్ ఖేల్ మే' ఉన్నాయి. ఆమె చివరిగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ 'డుంకీ'లో షారుఖ్ ఖాన్‌తో కలిసి కనిపించింది.

More from Filmibeat

Read more about: taapsee pannu bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X