ఆ సినిమా నుంచి దర్శకుడు కూడా పీకలేడు.. తాప్సీ సవాల్
కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న హీరోయిన్ తాప్సీ గతేడాది అనుభవ్ సిన్హా దర్శకత్వంలో 'ముల్క్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ దర్శకుడితో తాప్సీ మరో చిత్రం చేయబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
''మంచి ఫుడ్‌తో న్యూ బిగినింగ్. ఇది నా హార్టుకు ఎంతో దగ్గరైన సబ్జెక్ట్. ఇది చేయడానికి దాదాపు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను. అనుభవ్ సిన్హా సర్‌తో కలిసి చేయడం ఆనందంగా ఉంది. మార్చి 8, 2020లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.'' అని టాప్సీ ట్వీట్ చేశారు.
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ... 'అనుభవ్ సిన్హా సర్... తాప్సీకి అసలు నటన రాదు. మీరు ఆమెను కాకుండా వేరొక నటిని ఎంపిక చేస్తే బావుంటుంది' అంటూ కామెంట్ చేశాడు. విశాల్ అనే నెటిజన్ చేసిన ఈ కామెంటుపై తాప్సీ తనదైన శైలిలో స్పందించారు.

'సారీ యార్.. నేను ఆల్రెడీ ఈ సినిమాకు సైన్ చేశాను. ఇప్పుడే ఏమీ చేయలేం. సర్ నన్ను ఈ మూవీ నుంచి తీసేయాలనున్నా అలా జరుకుండా చేస్తాను. ఈ సినిమాలో నన్ను తీసివేసే అవకాశం లేదు కాబట్టి నేను మరో చిత్రానికి కమిట్ అయ్యేలోపే అందులో నాకు అవకాశం రాకుండా ఆపి చూడు' అంటూ తాప్సీ రిప్లై ఇచ్చారు.
తాప్సీ ఇచ్చిన రిప్లైపై అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. అతడికి తగిన బుద్ది చెప్పావ్ అంటూ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాప్సీ సినిమాల విషయానికొస్తే ఆమె నటించిన 'తడ్కా' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు మిషన్ మంగళ్, సాంద్ కి ఆంఖ్ చిత్రాల్లో తాప్సీ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











