For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆయన భార్య కోసం నాకు హ్యాండ్ ఇచ్చాడు: స్టార్ హీరోపై తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్

  |

  తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా సినీరంగ ప్రవేశం చేసి.. బాలీవుడ్‌లో స్థిరపడిపోయింది ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో పరాజయాలను చవి చూసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అంతేకాదు, వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. మరోవైపు, తన వ్యవహార శైలితో తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సినీ పరిశ్రమలోని స్టార్ హీరోతో పాటు కొందరు ప్రముఖులపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

  దర్శకేంద్రుడి సినిమాతో పరిచయం

  దర్శకేంద్రుడి సినిమాతో పరిచయం

  మంచు మనోజ్ నటించిన ‘ఝుమ్మంది నాదం' అనే సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించింది తాప్సీ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీలో ఆమె ఎంతో గ్లామర్‌గా కనిపించడంతో వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే ‘వస్తాడు నారాజు', ‘వీర', ‘మొగుడు', ‘దరువు' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. వాటిలో ఒక్కటి కూడా హిట్ అవలేదు.

  అక్కడ మాత్రం సూపర్ సక్సెస్‌ఫుల్

  అక్కడ మాత్రం సూపర్ సక్సెస్‌ఫుల్

  తెలుగులో హిట్ లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంది తాప్సీ. అదే సమయంలో ఐరన్ లెగ్ అనే చెడ్డ పేరును సైతం మూటగట్టుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అమ్మడు. తొలి సినిమాతోనే హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత అమితాబ్‌తో కలిసి ‘పింక్' చిత్రంలో నటించింది. ఈ మూవీ విజయంతో తాప్సీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

  సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్‌తో

  సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్‌తో

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న తాప్సీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, తరచూ తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇందులో భాగంగానే కొన్ని బికినీ పిక్స్‌ను కూడా షేర్ చేసి హాట్ టాపిక్ అయిపోయింది.

  ప్రియుడితో రచ్చ.. వివాదాలు కూడా

  ప్రియుడితో రచ్చ.. వివాదాలు కూడా

  తాప్సీ.. ఇటీవలే తన ప్రియుడు మాతియాస్ బోతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో వదిలింది. వీళ్లిద్దరూ లాక్‌డౌన్ సమయంలో మాల్దీవుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరగడం హైలైట్ అయింది. ఇక, తాప్సీ తన వ్యవహార శైలితో తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండస్ట్రీ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

  భార్య కోసం నాకు హ్యాండ్ ఇచ్చాడు

  భార్య కోసం నాకు హ్యాండ్ ఇచ్చాడు

  తాజాగా ఓ హిందీ ఛానెల్‌తో మాట్లాడిన తాప్సీ.. ఇండస్ట్రీల్లో తనకు జరిగిన అవమానాల గురించి వివరించింది. ‘నాకు అన్ని భాషల్లోని పరిశ్రమల్లో చాలా అవమానాలు జరిగాయి. చాలా మంది నా పట్ల వివక్ష చూపించే వారు. ఓ పేరున్న హీరో అయితే తన భార్యకు నచ్చలేదని నన్ను సినిమా నుంచి తప్పించాడు' అని చెప్పుకొచ్చింది. అయితే, ఆ హీరో పేరు బయటకు చెప్పలేదు.

  #CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
  నాకు చెప్పకుండానే పని చేసేశారు

  నాకు చెప్పకుండానే పని చేసేశారు

  అలాగే, తన జీవితంలో జరిగిన మరిన్ని అవమానాల గురించి స్పందిస్తూ.. ‘కెరీర్ ఆరంభంలో నన్ను చాలా మంది దర్శక నిర్మాతలు ఐరన్ లెగ్ అనేవాళ్లు. సినిమా ఫ్లాప్ అయితే నా మీదకే తోసేసేవాళ్లు. ఇంకో సందర్భంలో మొదట నాతో డబ్బింగ్ చెప్పించి, ఆ తర్వాత అది బాలేదని మరొకరితో చెప్పించారు. ఆ విషయం గురించి నాకు మాత్రం చెప్పలేదు' అని వెల్లడించింది.

  English summary
  Taapsee Pannu who started her career with Telugu, Tamil and Hindi films is now a famous Bollywood actress. She also has been a part of many controversies as soon as she came in the highlight.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X