Just In
- 1 min ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 12 min ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 1 hr ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 1 hr ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
ప్లాస్టిక్ జెండా ఎగరేశారో ఇక అంతే.. కఠిన చర్యలు తప్పవు, కేంద్రం వార్నింగ్..
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నువ్వొక ఫాల్తూ హీరోయిన్ తాప్సి.. అసలు నటన కూడా రాదు.. దిమ్మతిరిగే కౌంటర్
ఒక హీరోయిన్ టాలీవుడ్ లో క్లిక్కయితే బాలీవుడ్ సైడ్ ఈజీగా అవకాశాలు అందుకోవచ్చనే సెంటిమెంట్ చాలా ఏళ్లుగా వస్తున్నదే. అయితే ఇక్కడ అంతగా సక్సెస్ రేట్ లేకపోయినా హీరోయిన్స్ కొంతమంది బాలీవుడ్ సైడ్ వెళ్లి భారీ స్థాయిలో అవకాశాలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో తాప్సి ఒకరు. నటిగా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు ఊహించని విధంగా విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఇక ఇటీవల ఒక ఘాటైన విమర్శకు అమ్మడు ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చింది.

ఆ సినిమాతో జాతకమే మారిపోయింది
టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా క్లిక్కయినప్పటికి ఆమె టాలెంట్ ని బయటపెట్టె సినిమాలు ఎక్కువగా రాలేదు. ఇక బికినీ వేసి బాలీవుడ్ లో ఎప్పుడైతే డోస్ పెంచిందో అప్పటి నుంచి సొట్ట బుగ్గల సుందరి జాతకమే మారిపోయింది. వరుణ్ ధావన్ జూడ్వా 2 సినిమాతో ఒక్కసారిగా నార్త్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. అనంతరం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది.

ఆమెలో వచ్చిన మార్పు.. అర్ధమవుతోంది
తాప్సి కథలను ఎంచుకుంటున్న విధానం చూస్తుంటే ఆమెలో ఎంత మార్పు వచ్చిందో చాలా ఈజీగా అర్ధమవుతోంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కథకు తగ్గట్లు పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తోంది. అయితే అనుకోకుండా తాప్సి పలుమార్లు విమర్శలను ఎదుర్కొంటోంది. ఇటీవల ఎందుకోగాని ఒకక్ నెటిజన్ చేసిన విమర్శ ఆమెను గట్టిగానే హార్ట్ చేసింది.

ఎలా ఉన్నా.. నెగిటివ్ కామెంట్స్ తప్పవు
చాలా వరకు సినీ తారలకు సోషల్ మీడియాలో ఎలా స్పందించినా కూడా కొన్ని విమర్శలు తప్పవు. పాజిటివ్ గా చెప్పినా కూడా నెగిటివ్ కామెంట్స్ చేసేవారు ఉంటారు. ఇది చాలా కామన్ అనుకొని చాలా వరకు సెలబ్రెటీలు పట్టించుకోరు. ఇక తాప్సి మాత్రం అప్పుడప్పుడు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. వీలైనంత వరకు ఈ బ్యూటీ కూల్ గా కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది.

నువ్వొక ఫాల్తూ హీరోయిన్
ఇటీవల తాప్సి తన తదుపరి చిత్రం రష్మీ రాకెట్ కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే ఒక నెటిజన్ ఆమె రష్మీ రాకెట్ ఫొటోపై అసభ్యకరంగా కామెంట్ చేశాడు. అసలు తాప్సికి నటన అనేది తెలియదు. ఎదో ఒక రకంగా ఎంచుకొని ఎత్తుకొని సినిమాలు చేస్తున్నావ్. నువ్వొక ఫాల్తూ హీరోయిన్ అని.. నెగిటివ్ కామెంట్స్ చేశాడు.

తాప్సి స్ట్రాంగ్ కౌంటర్
ఇక తాప్సి ఆ నెగిటివ్ కామెంట్స్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. 'ఏం ఎత్తుకొని ఎంచుకోని సినిమాలు చేస్తున్నాను? నా ఇమేజ్ ని అయితే ఇప్పటికే ఒక విధంగా పైకి ఎత్తుకున్నాను. ఆ విషయం నీకు సరిగ్గా అర్థమైనట్లు లేదు.. అంటూ తాప్సి పన్ను ఊహించని విదంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ మీడియాలో వైరల్ గా మారాయి. తాప్సి ఇచ్చిన సమాధానం కరెక్ట్ అంటూ ఆమె ఫాలోవర్స్ మద్దతు తెలుపుతున్నారు.