గోల్డ్ డ్రెస్సులో ప్రభాస్ బ్యూటీ .. తరగని అందాలతో తాపం పెంచుతున్న తాప్సి
Taapsee Pannu : సొట్టబుగ్గల సుందరిగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న బ్యూటీ తాప్సీ. ఈ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన తాప్సీ పన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలిసినిమాతోనే టాలెండ్ నిరూపించుకున్న ఈ అమ్మడుకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఆ పాపులర్టీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ అమ్మడు. కొత్తలో కొన్నాళ్ల పాటు కమర్షియల్, యూత్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించినా ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు షిఫ్ట్ అయిపోయింది.
తాప్సీ పన్ను తొలుత 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించగా .. తాప్సీ హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది. తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదనే చెప్పాలి. వరస సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. అలా అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఈ అమ్మడు కేవలం తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంది. తర్వాత పలు సినిమాలు చేసినా.. ఈ బ్యూటీ ఇక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆఫర్స్ మాత్రం తక్కువే. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ పై కన్ను వేసి అక్కడికి చెక్కేసింది. తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించిన తాప్సీ, తర్వాత హిందీ సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. "పింక్", "ముల్క్", "బద్లా", "మన్మర్జియన్" వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల్లో ఆమె ప్రదర్శించిన నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుని ప్రస్తుతం అక్కడే సెటిల్ అయిపోయింది. అంతేకాకుండా.. అక్కడ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బోని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియకుండా సీక్రెట్ గా పెట్టేసింది. ఒకసారిగా తన ప్రేమ, పెళ్లి విషయాన్ని వెల్లడించి.. అందర్నీ షాకిచ్చింది. ఇదెలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. తాప్సీ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఈ భామ. తన గ్లామర్ షోతో కుర్రకారుకు అందాల విందును అందిస్తోంది. తాజాగా బంగారం టాప్ లో అందాలు ఆరబోస్తూ. షాక్ ఇచ్చింది. ఇక తాప్సీ ఫోటోలకు నెటిజన్లు కామెంట్లు, లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











