ఆ హీరోలో ఆ విషయం.. పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది.. తాప్సీ
Recommended Video
టాలీవుడ్‌కు దూరమైన తాప్సీ పన్ను బాలీవుడ్‌లో విలక్షణ నటిగా రాణిస్తున్నది. వరుస సినిమాలతోపాటు.. విజయాలతో కెరీర్‌ను ముందుకు నడిపిస్తున్నది. గతేడాది మన్మర్జియాన్, ఈ ఏడాది బద్లా లాంటి విజయాలను తన కెరీర్ ఖాతాలో వేసుకొన్నది. మన్మర్జియాన్ చిత్రంలో హీరో వికీ కౌశల్‌తో తాప్సీ కెమిస్ట్రీ విశేషంగా ఆకట్టుకొన్నది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వికీ కౌశల్‌పై తాప్సీ మనసు పారేసుకొన్నానని వెల్లడించింది. వికీపై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.

వికితో అలా దగ్గరయ్యా
మన్మర్జియాన్ సినిమాకు ముందు వికీతో పరిచయం లేదు. కేవలం వాట్సప్ పరిచయం మాత్రమే ఉంది. వాట్సాప్‌లో చాటింగ్ చేసుకొనే సమయంలో అతను పెట్టే కొటేషన్ ఆసక్తికరంగా ఉండేది. ఆ తర్వాత సినిమా షూటింగ్‌లో ఒకరికొకరం దగ్గరయ్యాం. వికీ ఓ నమ్మదగిన వ్యక్తి అని అని తాప్సీ వెల్లడించింది.

తాప్సీపై వికీ ప్రశంసలు
ఆ సందర్భంగా తాప్సీపై వికీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు. బాగా మాట్లాడుతారు. అంతేకాకుండా ఎదుటివారు చెప్పే విషయాలను ఆసక్తిగా వింటారు. తాప్సీతో పరిచయం నా ఆలోచనలను మార్చేసింది అంటూ కవితాధోరణిలో వికీ కౌశల్ అన్నారు. ఇలాంటి సంభాషణలతో చాట్ షో ఆసక్తికరంగా సాగింది.

వికీలో ఆ విషయం ఉంది
ఛాట్ షోలో భాగంగా వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్, వికీ కౌశల్ గురించి ఒక్క మాటలో చెప్పమని తాప్సీని కోరగా.. వికీ కౌశల్ పెళ్లి చేసుకొనేంతగా ఇంప్రెస్ చేశాడు. ఆయనలో మ్యారేజ్ మెటీరియల్ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది వికీ నటించిన సంజూ నాకు నచ్చలేదని చెప్పగా.. తాప్సీ నటించిన నామ్ షాబానా నాకు నచ్చలేదు అని వికీ చెప్పడం గమనార్హం. వరుణ్ ధావన్, అభిషేక్‌పై గమ్మత్తైన సమాధానాలు చెప్పింది.

ఉద్దమ్ సింగ్ బయోపిక్ మూవీలో
ఇటీవల విడుదలైన బద్లా చిత్రంతో బాలీవుడ్‌లో తాప్సీ మరో విజయాన్ని అందుకొన్నది. పింక్ తర్వాత అమితాబ్‌తో కలిసి మరోసారి నటించింది. తాప్సీ ప్రస్తుతం ఉద్దమ్ సింగ్ బయోపిక్, అలాగే సాండ్ కీ ఆంఖ్ అనే చిత్రాల్లో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











