వైరల్ వీడియో: గేర్ వేయమంటే అక్కడ పట్టుకున్న తాప్సీ.. మగవారిని హింసిస్తావా అంటూ..

తాప్సీ.. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరిది. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి మోడలింగ్ వైపు వచ్చిన ఈమె.. 'ఝుమ్మందినాదం' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో కనిపించిన ఈ సుందరి.. తమిళంలోనూ మెరిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన సరైన హిట్‌ను తన ఖాతాలో వేసుకోకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది.

బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది

అక్కడ చేసిన తొలి సినిమాతోనే హిట్ సాధించి, ఆ తర్వాత అమితాబ్‌తో కలిసి ‘పింక్' చిత్రంలో నటించింది. ఇది భారీ విజయం సాధించడంతో పాటు ఆమె మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో అప్పటి నుంచి హిందీలో బిజీ అయిపోయింది. వరుసగా సినిమాలు చేస్తూ దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఓ సీన్ వల్ల ట్రోలింగ్స్‌కు గురవుతోంది.

మిషన్ మంగళ్

మిషన్ మంగళ్

తాప్సీ తాజాగా నటించిన చిత్రం ‘మిషన్ మంగళ్'. జగన్ శక్తి దీనిని తెరకెక్కించాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ రాకేష్ ధావన్ అనే సైంటిస్ట్ పాత్రలో నటించాడు. ఈ మిషన్‌లో భాగస్వామ్యం ఉన్న ఇతర ముఖ్యపాత్రల్లో విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మీనన్, కీర్తి కుల్హరి నటించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్‌లో ఆ సీన్

ఈ సినిమా రిలీజింగ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితం విడుదల చేసింది. ఇందులో తాప్సీకి ఓ వ్యక్తి కారు నేర్పుతుంటాడు. ఆ సమయంలో ఆమెతో ‘నువ్వు కారు డ్రైవ్ చేసే సమయంలో దృష్టిని రోడ్డు పైపు నుంచి మరల్చకూడదు. ఇప్పుడు ఫోర్త్ గేర్ వెయ్' అని అంటాడు. వెంటనే తాప్సీ గేర్ వేయాలన్న తాపత్రయంలో అతడి ప్రైవేటు పార్టును ప్రెస్ చేస్తుంది.

విపరీతంగా ట్రోల్స్

తాప్సీకి సంబంధించిన ఈ సన్నివేశాన్ని మాత్రమే కట్ చేసి పలువురు నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు చేసే ముందు ఆలోచించుకోరా అని ఒకరు అంటే.. ఇలా అక్షయ్ కుమార్‌కు కూడా చెయ్ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు, ఇలా చేయమని నీకు ఎవరు చెప్పారు..? అని కూడా ప్రశ్నిస్తున్నారు.

గతంలో చేసిన వ్యాఖ్యలను చూపిస్తూ..

‘కబీర్ సింగ్' డైరెక్టర్ సందీప్ రెడ్డిపై గతంలో తాప్సీ విమర్శలు చేసింది. ఆమె ఓ చానెల్‌తో మాట్లాడుతూ ‘కబీర్ సింగ్' డైరెక్టర్‌పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించింది. ‘‘ఇటీవల నాగ్‌పూర్‌లో ఓ హత్య జరిగింది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమెను దారుణంగా చంపేశాడు. నిజంగా ప్రేమ ఉంటే ఇలాగే చంపేస్తారా..? నిజమైన ప్రేమ అంటే ఇదేనా..? నిజమైన ప్రేమ ఎప్పుడు ఇలాంటి పనులు చేయించదు.. కేవలం ప్రేమనే కోరుకుంటుంది'' అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది.

సినిమా ఎందుకు చేశారు.?

సినిమా ఎందుకు చేశారు.?

మరో నెటిజన్ ఈ సినిమా సన్నివేశాన్ని షేర్ చేస్తూ.. ‘మీరు భారతదేశం సాధించిన విజయాలను చూపించడానికి ‘మిషన్ మంగళ్' చేశారా..? లేక తాప్సీ పన్ను మగ వారిని హింసించేందుకు చేశారా' అంటూ ప్రశ్నించాడు. అంతేకాదు, ‘కబీర్ సింగ్ ఒక అమ్మాయిని కొట్టడం తప్పు అయితే, తాప్సీ ఒక వ్యక్తిని వేధించడం ఖచ్చితంగా నేరమే' అని చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X