నేను బాగానే పెంచాను.. కానీ అలాంటి కోరిక లేదు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో ఝుమ్మంది నాదం సినిమాతో ఎంటరై.. అందాల ఆరబోతతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా ఆఫర్స్ రావడంతో బిజీగా మారిపోయింది. అన్ని గ్లామర్ పాత్రలే కావడం.. కొన్ని సినిమాలు కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవడంతో కాస్త వెనుకబడింది.

బాలీవుడ్ పయనం...
ఇక్కడ వచ్చిన ఈ ఫేమ్‌తో బాలీవుడ్, కోలీవుడ్‌లో చాన్సులు పట్టేసింది. అక్కడ నటిగా నిరూపించుకుని ఫుల్ బిజీగా మారిపోయింది. తాప్సీ స్టార్ హీరోయిన్‌గా మారిపోయి.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకుంది. వరుస హిట్లతో ఫుల్ బిజీగా మారిపోయింది.

పింక్, బాద్లాతో సూపర్ హిట్..
అమితాబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేశాయి. ఇక ఇందులో తాప్సీ నటకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. పింక్ చిత్రంతో అమితాబ్, తాప్పీ మ్యాజిక్ చేయగా.. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లోనే బాద్లా చిత్రం వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్‌గా నిలిచింది.

సాండ్ కీ ఆంఖ్‌తో ఫుల్ బిజీ..
లేట్ వయసులో షూటర్స్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న చంద్రో, ప్రకాశ్ తోమర్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న సాండ్ కీ ఆంఖ్ సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రశంసలు అందుకుంటోన్న తాప్సీ, భూమి ఫడ్నేకర్.
ఈ ట్రైలర్ విడుదలైన్పపటి నుంచి తాప్సీ, భూమి ఫడ్నేకర్‌లపై ప్రశంసలు కురుస్తున్నాయి. వయసు మళ్లిన పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్లను తమ భుజాలపై వేసుకున్న వీరు.. క్షణకాలం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు.

రెమ్యూనరేషన్ విషయమై మాట్లాడుతూ...
ఇటీవలె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రెమ్యూనరేషన్ పెంచిన విషయమే నిజమే.. అప్పటికి ఇప్పటికీ నేను తీసుకునే దాంట్లో భారీగానే మార్పులు వచ్చాయి.. అయితే అది చాలా తక్కువే అని అనుకుంటున్నట్లు పేర్కొంది. తనతో పోలిస్తే ఇంకా చాలా మంది హీరోలకు ఎక్కువే ముడుతోందని..దాంతో చూస్తే తను చాలా తక్కువే తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

అలాంటి కోరికేమీ లేదు..
డిమాండ్ ఉంది కదా అని ఒక్కసారే అమాంతం పెంచేసి.. సొమ్ముచేసుకోవాలనే కోరిక లేదని తెలిపింది. తన పారితోషకం వల్ల సినిమాలకు ఇబ్బంది కలగకూడదని కోరుకుంటానని పేర్కొంది. నిర్మాతలను ఇబ్బంది పెట్టే విదంగా తానేమీ కోరడం లేదని చెప్పుకొచ్చింది. దీపావళి కానుకగా సాండ్ కీ ఆంఖ్ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











