Taapssee Pannu సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఉందా? మరోసారి నోరుపారేసుకొన్న హీరోయిన్ తాప్సీ

దక్షిణాది సినిమా పరిశ్రమ ద్వారా హీరోయిన్‌గా మారిన తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. అయితే తనకు సినీ జన్మను ఇచ్చిన తెలుగు సినిమా పరిశ్రమపైనే కొన్ని సార్లు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పి.. తప్పు తెలుసుకొన్నారు. తాజాగా దక్షిణాది సినిమాలపై తాప్సీ మరోసారి నోటి దురుసును బయటపెట్టుకొన్నది. గతంలో తాప్సీ మాట్లాడిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడిందంటే?

గతంలో తాప్సీ ఓ సందర్బంలో ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమలో పాటలను అసభ్యంగా చిత్రీకరిస్తారు. ఓ దర్శకుడు అవసరం లేకపోయినా బొడ్డుపై పండ్లు విసిరికొడుతాడు. ఆయన కేవలం యాపిల్, ఆరెంజ్ పండ్లతోనే కొట్టాడు. అంతకంటే పెద్ద పండ్లతో కొడితే నా పరిస్థితి ఏమౌతుందనే తలచుకొంటే భయమేస్తుంది అని అన్నారు.

Taapssee Pannu Objectional Comments on Telugu Film Industry and South Film Industry?

ఆ తర్వాత రాఘవేంద్రరావుకు స్వయంగా ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. తాను మాట్లాడిన మాటలు వేరే సందర్భాన్ని ఊహించి అన్నాను. వాటిని మీరు తప్పుగా అర్ధం చేసుకోకూడదు. మీరంటే నాకు చాలా గౌరవం అని తన మాటలను వెనక్కి తీసుకొన్నది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్‌తో కలిసి నటించడం ద్వారా తాప్సీ తెలుగు ఇండస్ట్రీకి, దక్షిణాది పరిశ్రమకు పరిచయమైన విషయం తెలిసిందే.

Taapssee Pannu Objectional Comments on Telugu Film Industry and South Film Industry?

గతంలో ఓ సినిమా ప్రమోషన్స్‌లో తాప్సీ మాట్లాడుతూ.. నా సినిమా రద్దు చేశామని నోటీసులు పంపింది. అయితే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ, నార్త్ ఫిలిం ఇండస్ట్రీ అని వేరు చూసి చూడకూడదు. అసలు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఫిలిం ఇండస్ట్రీస్ వేర్వేరుగా ఉన్నాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేదు అని అన్నారు.

RRR సినిమా తీసుకొంటే అది తెలుగు ఫిలిం, పుష్ప సినిమాను తీసుకొంటే.. తెలుగు ఫిలిం. ఇతర భాషల్లో రిలీజై విజయాలు సాధించాయి. కేజీఎఫ్ కన్నడ సినిమా. అది సౌత్ ఫిలిం కాదు. అంతేకానీ ఆ రెండు కూడా సౌత్ సినిమాలు కాదు. అలా అనుకొంటే గుజరాతీ, భోజ్‌పూరి సినిమాలను బాలీవుడ్ కింద తీసుకోం. హిందీ సినిమా పరిశ్రమ చాలా పెద్దది. అందులో వీటిని కలుపలేం అని తాప్సీ అన్నారు. తాప్సీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X