twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tabu: 50 ఏళ్ళ వయసులోనూ వన్నె తరగని అందం.. టబు హాట్ స్టిల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

    |

    చిత్ర పరిశ్రమలో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఒకప్పుడు టబు రేంజ్ లో క్లిక్కయిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో కుర్రాళ్ళ నుంచి ఒక స్పెషల్ క్రేజ్ అందుతూ ఉండేది. వీలైనంత వరకు ఎక్కువగా గ్లామరస్ పాత్రలతోనే తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేసింది. ఇక ఆమె ప్రస్తుతం ఐదు పదుల వయసులో కూడా గ్లామర్ తో షాక్ ఇస్తోందనే చెప్పాలి.

    హైదరాబాద్ లోనే..

    హైదరాబాద్ లోనే..

    హైదరాబాద్ లో ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన టబు తన స్కూల్ ఎడ్యుకేషన్ ను పూర్తి చేసిన తరువాత ముంబై వెళ్లిపోయింది. అక్కడ రెండేళ్ల చదువు అనంతరం ఆమె ఫోకస్ మోడలింగ్ పై పడింది. ఇక ఆ తరువాత సినిమాల్లో ఛాన్సులు రావడంతో చాలా ఈజీగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

    టాలీవుడ్ హిట్స్

    టాలీవుడ్ హిట్స్

    ఆమె కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ ఉన్నాయి. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. టబు సినిమాలో ఉందంటే అందులో గ్లామర్ డోస్ గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇక కూలి నెంబర్ వన్ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన టబు ఆ తరువాత నాగార్జునతో నిన్నే పెళ్లాడతా వంటి హిట్ సినిమా చేసింది.

    అందరి హీరోలతో..

    అందరి హీరోలతో..

    వెంకటేష్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఇలా అందరి హీరోలతో సినిమాలు చేసిన టబు ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇస్తోంది. ఆమె బాలీవుడ్ మూవీ అందధూన్ లో చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. టబు ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో ఒదిగి నటిస్తుంది.

    హాట్ లుక్ వైరల్..

    హాట్ లుక్ వైరల్..

    ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామరస్ ఫోటో షూట్స్ తో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. టబు వయసు 51 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల టబు బ్లాక్ డ్రెస్ లో ఇచ్చిన ఒక స్టిల్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    సోలో లైఫ్ తో హ్యాపీగా..

    సోలో లైఫ్ తో హ్యాపీగా..

    ఇక టబు పెళ్లి చేసుకోలేదని అందరికి తెలిసిన విషయమే. ఆమె మొదట్లో ఒక తెలుగు హీరోతో ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకుని కొన్ని గోడవల కారణంగా వెనక్కి తగ్గిపోయింది. అనంతరం బాలీవుడ్ లో కూడా కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ ను చూసిన టబు అనంతరం పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయింది. ఎమోషన్స్ తో ఉండకూడదు అని తనకు నచ్చిన విధంగా సోలో లైఫ్ తో హ్యాపీగా కెరీర్ ను కొనసాగిస్తోంది.

    ఆఫర్స్ చాలానే వస్తున్నాయట..

    ఆఫర్స్ చాలానే వస్తున్నాయట..

    ఇక చివరగా తెలుగులో అల.. వైకుంఠపురములో అనే సినిమా చేసిన టబు మళ్ళీ మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే ఆమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. నితిన్ చేసిన అందధూన్ రీమేక్ కోసం మళ్ళీ ఆమెనే తీసుకోవాలని అనుకున్నారు. కానీ రీమేక్ చేయనని టబు రిజెక్ట్ చేసింది. ఇక ప్రస్తుతం టబు బాలీవుడ్ లోనే మూడు సినిమాలు చేస్తోంది.

    English summary
    Tabu latest glamorous photo viral in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X