‘రాత్రికి రాత్రే 45 ఏళ్లు రావుగా... మా ఇంట్లోనూ అద్దం ఉంది’
చిత్ర పరిశ్రమలో తమను అందరూ చులకనగా చూస్తారని హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. హీరోలతో పోలిస్తే అన్ని విషయాలలో తమపై వివక్ష చూపుతున్నారని బహిరంగంగానే మండిపడుతుంటారు. అలాగే ట్రోలింగ్, బాడీ షేమింగ్‌లకు కూడా తామే టార్గెట్ అవుతున్నామని వాపోతుంటారు. తాజాగా తమ వయసుపై ట్రోలింగ్‌కు దిగిన వారికి సీనియర్ హీరోయిన్ టబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లను తన అందం, నటనతో ఒక ఊపు ఊపారు టబు. హైదరాబాద్‌కు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి టబు. ఆమె అసలు పేరు తబుస్సమ్ హష్మీ. హిందీ నట దిగ్గజం షబానా అజ్మీకి టబు స్వయానా మేనకోడలు. టబు చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. తొలుత బజార్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఆమె .. అనంతరం హమ్ నే జవాన్‌లో నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు - విక్టరీ వెంకటేష్‌ల కాంబోలో వచ్చిన కూలీ నెంబర్ 1తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన టబు... తన అందాలతో అప్పట్లో కుర్రాళ్లకు పిచ్చెక్కిచ్చింది.

అనంతరం సిసింద్రీ, నిన్నేపెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, షాక్, ఇది సంగతీ, పాండురంగడు వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. తర్వాత హిందీ సినిమాలకే పరిమితమైన ఆమె.. వయసు పెరగడంతో తన ఇమేజ్‌కు తగిన పాత్రలనే చేస్తున్నారు. అల వైకుంఠపురంతో మూవీతో తిరిగి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో పలు చిత్రాలలో నటించారు. ఈ ఏడాది అక్షయ్ కుమార్ సరసన నటించిన భూత్ బంగ్లాతో ప్రేక్షకులను పలకరించారు టబు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి కాంబోలో తెరకెక్కుతోన్న స్లమ్‌డాగ్ మూవీలో టబు కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 100వ సినిమాలో టబు నటించనున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున సినిమాలో టబు నటిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
55 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే మిగిలిపోయారు టబు. 50 క్రాస్ చేసినా ఇప్పటికీ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్రభామలకు పోటీ ఇస్తున్నారు. తన అక్క కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసే పనుల్లో టబు బిజీగా ఉన్నారు. ఇక ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం టబు స్టైల్. సినిమాలతో పాటు బయటి విషయాలపైనా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ.. హీరోయిన్ల ఏజ్ ట్రోలింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
సినీరంగంలోని మహిళలపై సొసైటీ అనవసరంగా దృష్టి పెడుతోంది. వారి విజయాల కంటే వయసు గురించే జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మనింట్లో అద్దం లేనట్లుగా వచ్చి మనకే చూపించాలని చూస్తున్నారు. అయినా వయసు పెరగడం అనేది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు. ఈరోజు రాత్రి 20 ఏళ్ల వయసుతో నిద్రపోతే .. తెల్లారగానే 45 ఏళ్ల వయసు వచ్చేయదు కదా అంటూ టబు ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. టబు వ్యాఖ్యలకు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు.


Click it and Unblock the Notifications



