twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌందర్య బయోపిక్ కోసం టాలెంటెడ్ హీరోయిన్ ఫిక్స్.. జననం నుంచి డెత్ మిస్టరీ వరకు

    |

    ఇటీవల కాలంలో బయోపిక్ అనేది స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతోంది. కొందరు వాస్తవాలను దగ్గరగా చూపిస్తూ ఉంటే మరికొందరు కమర్షియల్ హంగులతో కల్పిత కథలను అల్లుతున్నారు. ఇక త్వరలో సౌత్ ఇండియన్ బ్యూటీఫుల్ హీరోయిన్ సౌందర్య బయోపిక్ కూడా వెండితెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

    గ్లామర్ డోస్ పెంచకుండా..

    గ్లామర్ డోస్ పెంచకుండా..

    1992 నుంచి 2004 వరకు బిజీ హీరోయిన్ గా చక్రం తిప్పిన నటీమణులలో సౌందర్య ఒకరు. దాదాపు సీనియర్ హిరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె మరచిపోలేని ఎన్నో పాత్రల్లో దర్శనమిచ్చారు. గ్లామర్ డోస్ పెంచకుండా ఎక్కువగా తన చిరునవ్వుతోనే కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేసేది. పొగరున్న అమ్మయిలానే కాకుండా తాళిబొట్టుకు విలువనిచ్చే ఒక సాధారణ మహిళలా కూడా సౌందర్య చేసిన క్యారెక్టర్లు ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

    సౌందర్య మరణం వెనుక కొన్ని అనుమానాలు

    సౌందర్య మరణం వెనుక కొన్ని అనుమానాలు

    ఇక ఆమె ఎంతో కష్టపడి హీరోయిన్ గా ఎదిగిన విషయం బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇక ఆమె మరణం అనేది అప్పట్లో ఒక పెద్ద మిస్టరీగా అందరిని షాక్ కి గురి చేసింది. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సౌందర్య మరణం వెనుక కొన్ని అనుమానాలు వచ్చినప్పటికీ ఆ తరువాత హెలికాప్టర్ సాంకేతిక లోపం వలనే క్రాష్ అయినట్లు నిర్దారణ అయ్యింది.

    సౌత్ ఇండియాలో సౌందర్య బయోపిక్

    సౌత్ ఇండియాలో సౌందర్య బయోపిక్

    సౌందర్య మరణించి ఇప్పటికే 16 ఏళ్లవుతోంది. ఇక ఇప్పుడు ఆమె బయోపిక్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్ వస్తోంది. మలయాళం సినిమా ఇండస్ట్రీలోని ఒక బడా నిర్మాణ సంస్థ సౌందర్య బయోపిక్ ని సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక సౌందర్య బయోపిక్ కోసం గత ఏడాది స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లు టాక్ వచ్చింది.

    Recommended Video

    Jagapathi Babu Opens Up On The Affair With Soundarya
    సౌందర్య పాత్రలో సాయి పల్లవి

    సౌందర్య పాత్రలో సాయి పల్లవి

    ఇక స్క్రిప్ట్ ఎలా ఉన్నా కూడా సౌందర్య లాంటి హీరోయిన్ మళ్ళీ తెరపై చూపించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక అందుకే సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి టాలెంటేడ్ యాక్టరే.. కానీ సౌందర్య లాంటి దిగ్గజ నటి పాత్రకు ఎంతవరకు సెట్టవుతుందనేది అతిపెద్ద సందేహం. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

    English summary
    Biopics have become a special attraction in recent times. Some are showing facts up close while others are weaving fictional stories with commercial twists. It seems that the South Indian beautiful heroine soundarya biopic is also coming to the silver screen soon. Clarity is also reported on who will play her role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X