నాగచైతన్యతో డేటింగ్స్ రూమర్స్.. శోభితా ఊహించని రియాక్షన్.. ఎందుకు స్పందించాలి అంటూ..

అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ డేటింగ్ లో ఉన్నారని, అక్కడ కనిపించారని, ఇక్కడ కనిపించారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఓ రెస్టారెంట్లో చైతూ ఫోటో దిగితే వెనక శోభితా కనిపించడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి.

సమంత స్టేట్మెంట్ ను శోభితకు లింక్ చేస్తూ కొందరు కథనాలు అల్లేశారు. అయితే ఈ విషయంలో ఆమె మొత్తానికి ఓపెన్ అయ్యింది. కాస్త డైరెక్ట్ గానే ఆ గాసిప్స్ పై ఓపెన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Talented actress Sobhita Dhulipala clarifications on relationship gossips

ఇది కరెక్ట్ కాదని: అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ గురించి చాల రోజులుగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే దీనిపై స్పందించిన నాగచైతన్య.. సంబంధం లేని మూడో వ్యక్తిని మధ్యలోకి ఎందుకు లాగుతున్నారని, ఇది కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు. సామ్ నేను చాలా హ్యాపీగానే విడిపోయాము అని ఆమె ఎక్కడున్నా కూడా చాలా హ్యాపీగా ఉండాలని నాగచైతన్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Talented actress Sobhita Dhulipala clarifications on relationship gossips

శోభితా దూళిపాళ స్పందన: డేటింగ్ రూమర్లపై తాజాగా శోభితా దూళిపాళ కూడా స్పందించింది. తను ఏ తప్పూ చేయలేదని, అలాంటప్పుడు తాను ఎందుకు స్పందించాలని ఎదురు ప్రశ్నిస్తోంది.'నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు.

అలాంటప్పుడు అర్జెంటుగా మీడియా ముందుకు వచ్చి నాపై వచ్చిన పుకార్లపై స్పందించాల్సిన అవసరం నాకేముంది. నాకు అలా క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదు. నేను ఏ తప్పూ చేయలే. ఆ విషయం నాకు తెలుసు. జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవాలి, మంచిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలనేదే నా ఫోకస్'.

Talented actress Sobhita Dhulipala clarifications on relationship gossips

పట్టించుకోవాల్సిన అవసరం లేదు: 'నటీనటులు, సెలబ్రిటీలపై ఇలాంటి పుకార్లు పుట్టుకు రావడం సాధారణం. జీవితంలో ఏం కావాలో తెలిసినప్పుడు, ఫోకస్ ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి సినిమాలు చేస్తున్నాను. చిన్నప్పటి నుండి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. నేను క్లాసికల్ డ్యాన్సర్ ని. మణిరత్నం సినిమాలో రెహమాన్ సంగీతానికి డ్యాన్స్ చేయడంతో నా కల నెరవేరింది.'

మిగతా హీరోయిన్లతో పోలిస్తే: 'ఓ వైపు ఇన్ని స్పెషల్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఎవరో ఒకరిద్దరూ తెలియకుండా ఏదో మాట్లాడతారు. దాన్ని పట్టించుకుని, అంతగా ఫీల్ అయిపోవడానికేం లేదు' అంటూ తనపై వచ్చినచ రూమర్స్ పై స్పందించింది శోభితా దూళిపాళ. ఇలా తనపై వస్తున్న పుకార్లను లైట్ తీసుకుంది ఈ బ్యూటీ. మిగతా హీరోయిన్లతో పోలిస్తే, తనపై పుకార్లు చాలా తక్కువగానే వస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఆ దేవుడికి థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది.

Talented actress Sobhita Dhulipala clarifications on relationship gossips

డిఫరెంట్ సినిమాలతో: ఇక శోభితా సినిమాల విషయానికి వస్తే ఆమె మొదట హిందీ సినిమాలతోనే క్రేజ్ అందుకునే ప్రయత్నం చేసింది. ఇక 2018లో గూఢచారి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు అనంతరం మేజర్ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక ప్రస్తుతం శోభితా హిందీలోనే మరో సినిమా చేస్తోంది. అలాగే ఇంగ్లీష్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X