‘నా గురించి అలా రాశారు.. వెంటనే ఏడ్చాను’.. 21 ఏళ్లకే తమన్నాపై ఇలా
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన ఈ బ్యూటీ ఇప్పుడు సీనియర్ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. ఫస్ట్ పేజ్ లో స్టార్ హీరోలకు జోడిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. తన టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం తమన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. దీంతో తమన్నా భాటియా కాస్త డోస్ పెంచి బోల్డ్ కంటెంట్ లో కూడా నటించేందుకు వెనుకాడడం లేదు.
ఇక తమన్నా భాటియా చివరిగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళాశంకర్ చిత్రంలో నటించింది. ఇక త్వరలో ఓదెల 2 చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసింది. కుంభమేళా సమయంలో రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇంత సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని తమన్నా భాటియా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా తమన్నా భాటియా తన రాబోయే చిత్రాలతో ఓవైపు బిజీగా ఉంటూనే మరోవైపు తన అభిమానుల కోసం సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. అయితే రీసెంట్ గా తమన్నా భాటియా తన చిన్నదనంలో జరిగిన ఓ ఘటనను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన విద్యాభ్యాసం గురించి మాట్లాడింది. తను పదవ తరగతి చదువుతున్నప్పుడే సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, దాంతో ఇంటర్ నుంచి పెద్దగా కాలేజీ కూడా వెళ్లలేదని చెప్పింది.
తను కాలేజీకి వెళ్ళినప్పటికిని ప్రొఫెసర్లు ఎంతగానో సహకరించేవారని గుర్తు చేసుకుంది. ఒకానొక సందర్భంలో తన అసైన్మెంట్లను కూడా టీచర్లే రాసి ఇచ్చేవారని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేసింది. అయితే తనకు 21 ఏళ్లు ఉన్నప్పుడే తన గురించి న్యూస్ పేపర్లో వార్తలు వచ్చాయని తెలిపింది. అయితే అప్పుడు తను బాగా చదివే దానినని ఆ వార్త సారాంశం ఉండడం తనను భావోద్వేగానికి గురి చేసిందని తెలిపింది. తమిళ పేపర్లో ఆ వార్త చదివిన వెంటనే ఈడ్ చేశానని చెప్పుకొచ్చింది. మొదటిసారిగా తన గురించి వార్త చదవడం ఆనందంగా ఉందని చెప్పింది. ఆ ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిదని తెలియజేసింది.
ఇక తన కెరియర్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ప్రారంభమైందని, దక్షిణాది ఆడియన్స్ తనను ఎంతగానో ఆదరించాలని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది. ఇలా తన లైఫ్ లో జరిగిన బ్యూటిఫుల్ మెమోరీస్ ను అభిమానులతో పంచుకోవడంతో వారు సంతోషిస్తున్నారు. ఇక తమన్నా భాటియా తన ప్రియుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకుందామనుకున్న వీరు ఎందుకు విడిపోవలసి వచ్చింది అనేది రహస్యంగానే ఉండిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం వారి పరస్పర పోస్టులు వైరల్ అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక హోళీ వేడుకుల్లో వీరి కలిశారని, వారు ఇంకా రిలేషన్ లోనే ఉన్నారనేది మరో గాసిప్.


Click it and Unblock the Notifications











