Don't Miss!
- News
బీజేపీలోనే కన్నా - రంగంలోకి ఢిల్లీ పెద్దలు: పవన్ తో ఫైనల్ గా..!?
- Finance
Budget 2023: దేశంలోని పెద్ద రైతులపై పన్ను వేయాల్సిన సమయం వచ్చేసిందా..? ఎందుకిలా..
- Sports
Team India : ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Lifestyle
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
లవ్, సెక్స్ చాలా నార్మల్... అవన్నీ రియల్‌గా చూపించాం: తమన్నా
Recommended Video

సందీప్ కిషన్, తమన్నా జంటగా బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో రూపొందిస్తున్న చిత్రం 'నెక్స్‌ట్ ఏంటి. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హాట్ హాట్ చర్చ సాగుతోంది.
తెలుగు సినిమాల్లో సాధారణంగా లవ్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం చూశాం కానీ... సెక్స్ గురించి మాట్లాడటం చాలా అరుదు. అలాంటి అంశాల ప్రస్తావన వస్తే ఆ సినిమాను మరో కేటగిరీ కింద లెక్కవేస్తారు. పెద్ద హీరోయిన్లయితే ఈ తరహా స్క్రిప్టులు చేయడానికి సాహరించరు.

తమన్నా డేరింగ్ స్టెప్
బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. అక్కడ వీరేది వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో కరీనా కపూర్, సోనమ్ కపూర్ లాంటి స్టార్ హీరోయిన్లు సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ రియాల్టీకి దగ్గరగా ఉండే పాత్రల్లో నటించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఈ విషయంలో కాస్త డేరింగ్ స్టెప్ వేసి ‘నెక్ట్స్ ఏమిటి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

లవ్, సెక్స్ చాలా నార్మల్ అంటున్న తమన్నా
‘‘ఈ స్క్రిప్ట్ నాకు చెప్పినపుడు చాలా బోల్డ్‌గా అనిపించింది. లవ్, సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడే పాత్ర నేనెప్పుడూ చేయలేదు. అవి చాలా నార్మల్ థింగ్స్ అయినప్పటికీ సెల్యులాయిడ్‌లో అలాంటి ఇప్పటి వరకు మాట్లాడలేక పోవడం వల్ల ఇది పెద్ద అంశంగా కనిపిస్తుంది, ఓ మై గాడ్ అనే ఫీలింగ్ వస్తుంది.'' అని తమన్నా తెలిపారు.

అలాంటి విషయాలు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటాయి
‘‘హిందీలో ‘వీరేది వెడ్డింగ్' చూసినపుడు చాలా మంది ఓ మైగాడ్ అనే ఎక్స్‌ప్రెషన్స్ వ్యక్తం చేశారు. స్క్రీన్ మీద ఉమెన్ అలా మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తుంది. వాళ్లు అలాంటి విషయాలు ఎలా చెబుతారు అనేది చూడటం కూడా కాస్తఎగ్జైటింగ్‌గా ఉంటుంది.'' అన్నారు.
సైరాలో నా పాత్ర ఇప్పుడే చెప్పను.. చాలా స్పెషల్ అంటూ ఊరించిన తమన్నా!

ఇందులో అంతా రియల్‌గా చూపించాం
ఈ సినిమా చూపించే విషయాలు చాలా రియల్‌గా, చాలా చిల్‌గా, మన జీవితంలో ఒక భాగంలా ఉంటుంది. అయితే అంతా కూడా వినోదాత్మక ఫార్మాట్లో ఉంటుంది. సీరియస్‌గా ఉండటం.. ఈ సినిమా చూసి బ్యాడ్ గా ఫీలవ్వడం లాంటివి అయితే ఉండవు... అని తమన్నా స్పష్టం చేశారు.