'శృంగారం చేయడానికి నాకు ఇబ్బంది లేదు.. ఆ హీరోలకే సమస్య..'

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు , హిందీ సినిమాల్లో బిజీగా మారింది. ఈ మధ్యనే బాక్ సినిమాతో హిట్ అందుకున్న తమన్నా తెలుగులో ఓదెల 2 సినిమాలోనటిస్తోంది. ఈ మధ్యకాలంలో తమ్ము బేబీ అడల్ట్ కంటెంట్ తో అదరగొడుతుంది. ముఖ్యంగా లస్ట్ స్టోరీస్, జీ కర్దా వెబ్ సిరీస్ లలో అమ్మడి అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంటిమేటెడ్ సీన్స్ లో తమన్నాను చూసి తెలుగు అభిమానులు ఏంటి ఈమె మన తమన్నానే అనుకున్నారు అంటే అతిశయోక్తికాదు .

ఇక ఈ బ్యూటీ ఇంతలా బాలీవుడ్ లో అందాలను ఆరబోయడానికి కారణం విజయ్ వర్మ. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం నడుపుతున్న విషయం విదితమే. ఇక తమ ప్రేమను ఈ జంట అధికారికం కూడా చేశారు. అప్పటినుంచి బాలీవుడ్ కెమెరాల కంట కనపడే అద్భుతమైన జంటల్లో ఈ జంట కూడా చేరింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తమన్నా ఏ విషయాన్నీ అయినా నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటుంది. తన మనసులో ఏం అనుకుంటుంది అనేది ఎలాంటివారి ముందు అయినా చెప్పేస్తుంది.

Tamanna said that heroes are more troubled in romantic scenes than heroines

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా శృంగార సన్నివేశ విషయంలో హీరోయిన్స్ కన్నా హీరోలే ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. సాధారణంగా ఇంటిమేటెడ్ సీన్స్ అంటే హీరోయిన్స్ కొంచెం ఇబ్బంది పడుతుంటారు. బట్టలు లేకుండా.. ఎవరో తెలియని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయాల్సి వస్తుంది కాబట్టి హీరోయిన్స్ కొద్దిగా సిగ్గు పడుతూ ఉంటారు. కానీ.. సెట్ లో అలాంటి శృంగార సన్నివేశాలు చేసేటప్పుడు హీరోస్ ఎక్కువ ఇబ్బంది పడతారని ఆమె చెప్పుకొచ్చింది.

Tamanna said that heroes are more troubled in romantic scenes than heroines

" హీరోయిన్లకు శృంగార సన్నివేశాల్లో చేస్తున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటారు. నాకు అలా ఉండదు. కానీ, హీరోలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి గురించి ఎవరు మాట్లాడరు. వారికి కూడా చాలా షై ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అందాల ఆరబోతలోనూ తమ్ము తగ్గేది లేదు అని చెప్పకనే చెప్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. మరి ఈ చిన్నది ముందు ముందు ఎలాంటి విజయాలను అందుకుంటుందోచూడాలి .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X