రీమేక్ సినిమాపై బెంగపెట్టుకున్న మిల్కీ బ్యూటీ ...

ఈ మధ్యకాలంలో గ్లామర్ కు పెద్ద పీట వేస్తూనే, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కూ మిల్కీ బ్యూటీ తమన్నా పెద్ద పీట వేస్తోంది. కానీ, ఎంత ఆచి తూచి అడుగులు వేస్తున్నా ఎక్కడో ఓ చోట మన ప్రమేయం లేకుండానే సమస్యలు పుట్టుకొస్తుంటాయి. అలాగే తమన్నాకు ఓ విషయంలో చుక్కెదురైంది.

కొంతకాలం క్రితం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ ను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారన్న వార్త సంచలనం సృష్టంచింది. కోలీవుడ్ లో కాజల్ అగర్వాల్, తెలుగులో తమన్నాతో సినిమాను రీమేక్ చేసేశారు. కానీ, ఎప్పుడో పట్టాలెక్కిన సినిమాలు విడుదలకు మాత్రం నోచుకోవడంలేదు. దీనికి కారణాలు కూడా తెలియడంలేదు.

Tamanna upset over Queen remake, Miffed with director

ఓవైపు తమిళ రీమేక్ ప్యారిస్ ప్యారిస్ ను డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, తెలుగు రీమేక్ పై నెలకొన్న డైలమా ఇంకా అలాగే కొనసాగుతోంది. దీంతో తమన్నా మస్త్ అప్సెట్ అవుతోందట. తెలుగు సినిమా గురించి ఎవ్వరూ పట్టించుకోవడంలేదని ఫీలవుతోంది.

ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, తన తదుపరి చిత్రం జాంబీ రెడ్డిపై దృష్టిసారించిన వైనం అమ్మడికి అసలు మింగుడు పడటంలేదట. ఈ విషయంలో అప్సెట్ అయినప్పటికీ దట్ ఈజ్ మహాలక్ష్మీపై ఆశలు మాత్రం వదులుకోవడంలేదు తమన్నా. బాలీవుడ్ లో కంగనా రనౌత్ ను టాప్ హీరోయిన్ గా మార్చిన క్వీన్, తన ఫేట్ ను కూడా మార్చేస్తుందని ఆశపడుతోంది. మరి, అమ్మడి ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X