సైరాలో నా పాత్ర ఇప్పుడే చెప్పను.. చాలా స్పెషల్ అంటూ ఊరించిన తమన్నా!
మిల్కి బ్యూటీ తమన్నా త్వరలో నెక్స్ట్ ఏంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సందీప్ కిషన్ సరసన నటించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రచార చిత్రాల్లో తమన్నా రొమాంటిక్ లుక్ లో అదరగొడుతోంది. ఈ చిత్రంలో తమన్నా కాస్త అందాల డోసు పెంచినట్లుగానే కనిపిస్తోంది. హాట్ అప్పియరెన్స్ ఉండే కాస్ట్యూమ్స్ ధరించి కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. ప్రస్తుతం తమన్నా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. కునాల్ కోహ్లీ ఈ చిత్రానికి దర్శకుడు.
ఇదిలా ఉండగా తమన్నా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో సైతం నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డిలో తమన్నా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం గురించి అడిగితే ఊరించి సస్పెన్స్ లోకి నెట్టింది. సైరా చిత్రంలో చాలా ప్రత్యకమైన పాత్రలో నటిస్తున్నాయి. ఆ పాత్ర వివరాలు ఇప్పుడే చెప్పను. నేను నటించాల్సిన సన్నివేశాలు ఇంకా ఉన్నాయి అని పేర్కొంది.

తమన్నా కెరీర్ గతంలోలా జోరుగా సాగడం లేదు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. స్పెషల్ రోల్ అయినా, స్పెషల్ సాంగ్ అయినా నో చెప్పకుండా ఒప్పేసుకుంటోంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











