తమన్నా సినిమాపై 'అవెంజర్స్' ఎఫెక్ట్ !
మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందం, అభినయంతో తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవల వెంకటేష్ సరసన ఎఫ్2 చిత్రంలో నటించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది తమన్నా. ప్రస్తుతం తమన్నా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తమన్నా, ప్రభుదేవా కలసి నటించిన అభినేత్రి 2 చిత్రం.
అభినేత్రి చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తేదీ ప్రస్తుతం వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ప్రపంచ విని అభిమానులంతా ఎదురుచూసిన భారీ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ చిత్రాలకు పోటీగా అవెంజర్స్ ఇక్కడ వసూళ్ళలో రికార్డులు సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో అభినేత్రి చిత్రం విడుదల చేయడం మంచిది కాదని భావించిన అభినేత్రి 2 చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని మే 31కి వాయిదా వేశారు.

అభినేత్రి 2లో నందిత శ్వేతా కూడా నటిస్తోంది. అభినేత్రి 2 తో పాటు తమన్నా ప్రస్తుతం క్వీన్ రీమేక్ డట్ ఈజ్ మహాలక్ష్మి, సైరా నరసింహారెడ్డి లాంటి చిత్రాల్లో నటిస్తోంది. ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు.


Click it and Unblock the Notifications











