తమన్నాతో ఆ తప్పు చేస్తున్న రాశీఖన్నా... ఆ బోల్డ్ అటెంప్ట్ వర్కవుట్ అవుతుందా?
గ్లామర్ క్వీన్స్ తమన్నా భాటియా, రాశీ ఖన్నా ఇద్దరూ కలిసి తాజాగా పంచుకో అనే సాంగ్‌లో రేంజ్ లో అందాలు ఆరబోసిన విషయం తెలిసిందే. కానీ ఈ పాటకు ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ దక్కట్లేదు. అంతేకాకుండా రాశి.. తమన్నాతో కలిసి ఈ బోల్డ్ స్టెప్ తీసుకుని తప్పు చేసిందా? అనే డౌట్ మొదలైంది ఆమె అభిమానులకు. మరి వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఈ బోల్డ్ అటెంప్ట్ తో టార్గెట్ ను రీచ్ అవ్వగలరా? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై లుక్కేద్దాం.
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అరణ్మణై సీక్వెల్ గా అరణ్మణై 4 అనే మూవీ తెరపైకి రాబోతోంది. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ఫ్రాంచైజీలో అరణ్మణై 4 అనేది నాలుగవ భాగం. ఇందులో ఫస్ట్ పార్ట్ తప్ప మిగతా సీక్వెల్స్ హిట్ అవ్వలేదు. ఈ హారర్ అండ్ కామెడీ మూవీని తెలుగులో బాక్ అనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న బాక్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి రాశి ఖన్నా, తమన్నా భాటియా కలిసి స్టెప్పులు వేసిన స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పంచుకో అనే టైటిల్ తో విడుదలైన ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు మాత్రమే కాదు హాట్ హాట్ గా అందాల విందు చేశారు ఈ ఇద్దరు హీరోయిన్లు.
కానీ ఆశించిన విధంగా ఈ పాటకు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. మేకర్స్ వీళ్లిద్దరి గ్లామర్ ను వాడుకుని ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించడానికి గట్టిగానే ప్లాన్ చేశారు. అందులో భాగంగానే పాటను రిలీజ్ చేసి అందరినీ అట్రాక్ట్ చేద్దామనుకున్నారు. కానీ అన్ ఎక్స్పెక్టెడ్ ఆడియన్స్ రెస్పాన్స్ తో వాళ్ళ ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
ఇక తమన్నాతో పాటు ఇలా స్టెప్పులేసి రాశి ఖన్నా తప్పు చేసిందా? అనే డైలమాలో పడిపోయారు ఆమె అభిమానులు. సాధారణంగా ఫ్రేమ్ లో తమన్నాతో పాటే మరో హీరోయిన్ ఉన్నా కూడా ఆమెకే ఎక్కువగా గుర్తింపు దక్కుతుంది. ఎఫ్ 2 మూవీలో మెహరీన్ పరిస్థితినే ఎందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఆ సినిమాలో ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యత ఉన్నప్పటికీ క్రెడిట్ మాత్రం తమన్నాకే దక్కింది. ఇక గతంలో వీళ్ళిద్దరూ కలిసి మాస్ మహారాజా రవితేజతో బెంగాల్ టైగర్ అనే మూవీలో నటించారు. ఆ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి మరోసారి బాక్ మూవీలో బాగానే గ్లామర్ వలకబోశారు.
అయితే తమన్నాకు ఇటీవల కాలంలో ఈ బోల్డ్ సీన్ల కారణంగా క్రేజీ పాపులారిటీ దక్కింది. అందరిలాగే రాశి ఖన్నా కూడా అలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మరి ఇప్పుడు తమన్నాతో కలిసి ఆమె చేసిన ఈ బోల్డ్ అటెంప్ట్ ఆమె కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుంది? అనేది కొత్త అనుమానం. మరి బాక్ మూవీకి కూడా ఎప్పటిలాగే క్రెడిట్ అంతా తమన్నా కొట్టేస్తుందా? ఈ మూవీ ద్వారా రాశి ఖన్నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అనేది బాక్ మూవీ తెరపైకి వస్తేనే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











