twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్న తమన్నా: ఈ సారి ‘ఆహా’ అనిపిస్తుందట

    |

    దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. శేఖర్ కమ్ముల రూపొందించిన 'హ్యాపీడేస్'తో మొదటి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. దీంతో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇంత కాలం సినిమాల్లో సత్తా చాటిన ఆమె.. ఇటీవల 'లెవెంత్ అవర్' అనే వెబ్ సిరీస్‌లో నటించడం ద్వారా డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె మరో సిరీస్‌కు సిద్ధం అయిందని తెలుస్తోంది.

    'గుంటూరు టాకీస్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి వినూత్నమైన చిత్రాలతో తన సత్తాను నిరూపించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. తమన్నా భాటియా ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'లెవెంత్ అవర్'. ప్రదీప్ ఉప్పలపాటి దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌ ఆహాలో స్ట్రీమింగ్ అయింది. 'వకీల్ సాబ్' విడుదలైన రోజే ఇది కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సిరీస్‌ నిరాశనే మిగిల్చింది. ఫలితంగా తమన్నా మొదటి ప్రయత్నమే ఆమెకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా చేసింది.

    Tamannaah Another Web Series for Aha

    మొదటి వెబ్ సిరీస్‌ అంతగా హిట్ అవకున్నా.. తమన్నా భాటియా రెండో దానిని కూడా ప్రారంభించబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మిల్కీ బ్యూటీ ఆహా కోసం మరో వెబ్ సిరీస్‌లో నటించబోతుందట. దీనికి ఇప్పటికే దర్శకుడిని కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తి వివరాలు మాత్రం బయటకు రావడం లేదు. ఈ సిరీస్ కోసం ఆమె భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    English summary
    The digital debut of a big-screen star is always a special affair. It increases the value of the digital portal. After all, a big star, making their debut in a digital web series or film helps them in building trust with the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X