తెలంగాణ రాములమ్మ రేంజ్ లో తమన్నా రోల్.. సీటిమార్ కిర్రాక్ ఉంటదట!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఎలాంటి రోల్ చేసిన ఓ వర్గం ఆడియెన్స్ ఎక్కువగా ఆమె గ్లామర్ కోసమే సినిమాకు వస్తారు. నటిగా కొన్ని సినిమాలతో తన టాలెంట్ ని బయటపెట్టిన ఈ బ్యూటీ నెక్స్ట్ మరిన్ని బెస్ట్ సినిమాలతో రాబోతోందట. ఇంతవరకు గ్లామర్ పాత్రలతో ఎక్కువగా అలరించిన ఈ బ్యూటీ సీటీమార్ సినిమాలో మాత్రం ఒక మాస్ పాత్రతో థియేటర్స్ ని షేక్ చేయనుందట.
గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఆ సినిమా ఆగిపోయిందనే టాక్ వచ్చింది. కానీ తమన్నా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూతో సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నట్లు ఒక క్లారిటీ వచ్చింది. ఇకపోతే సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది. అందులో గోపిచంద్ ఆంద్రప్రదేశ్ ఉమెన్స్ కబడ్డీ జట్టుకు కోచ్ గా కనిపించనున్నాడు.

ఇక తెలంగాణ రాములమ్మ రేంజ్ లో తమన్నా తెలంగాణ భాషలో తన కాబట్టి టీమ్ ని పోరుకు సిద్ధం చేస్తుందట. రెండు తెలుగు రాష్ట్రాల కబడ్డీ గురువులుగా ఈ ఇద్దరు కనిపించబోతున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో తమన్నా రోల్ చాలా కీలకమని తెలుస్తోంది. నటిగా తన స్థాయిని పెంచే విధంగా ఉంటుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్కి బ్యూటీ ఆ పాత్ర గురించి చెప్పింది.
దర్శకుడు సంపత్ సినిమాను అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడని మొదటిసారి పూర్తి తెలంగాణ అమ్మాయిలా కనిపించబోతున్నట్లు తమన్నా వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











