లవ్.. సెక్స్.. 15 ఏట నుంచే.. తమన్నా బోల్డ్‌ స్టేట్‌మెంట్!

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో హిట్లు లేక టాప్ రేసులో తమన్నా భాటియా వెనుకపడింది. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రస్తుతం క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ, నెక్ట్స్ ఏంటీ అనే చిత్రాలతో ముందుకొస్తున్నది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం నెక్ట్స్ ఏంటీ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. స్క్రిప్టు, తన పాత్ర నచ్చడంతోనే నెక్స్ ఏంటీ సినిమాలో నటించాని అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

ఎస్ ఎస్ రాజమౌళి వల్లనే

ఎస్ ఎస్ రాజమౌళి వల్లనే

టాలీవుడ్‌లో చాలాకాలంగా నటిస్తున్నప్పటికీ.. నాకు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా ద్వారానే గుర్తింపు లభించింది. కేవలం నాకే కాదు టాలీవుడ్‌ సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. తెలుగు సినిమాలు రిలీజైతే ఎప్పుడెప్పుడూ చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ సినిమాలు హవా

టాలీవుడ్ సినిమాలు హవా

భారతీయ సినిమాకు టాలీవుడ్ దిశానిర్ధేశం చేస్తున్నది. ఇటీవల కాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి, RX 100, గూఢచారి చిత్రాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి అని తమన్నా పేర్కొన్నారు.

15 ఏట నుంచే యాక్టింగ్

15 ఏట నుంచే యాక్టింగ్

నా 15వ ఏటనే సినిమాల్లో నటించడం ప్రారంభించాను. నేను సంప్రదాయ కుటుంబానికి చెందిన దానిని. నా కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు చూస్తాను. అలాంటి పరిస్థితుల్లో నెక్ట్స్ ఏంటి మూవీ స్క్రిప్టు నా వద్దకు వచ్చింది. అది చదివినప్పుడు లవ్.. సెక్స్.. లవ్.. సెక్స్ అనే పదాలే కనిపించాయి. తొలిసారి నాకు సరిపడే సినిమా అనిపించింది అని తమన్నా పేర్కొన్నారు

నెక్ట్స్ ఏంటీ సినిమా

నెక్ట్స్ ఏంటీ సినిమా

నెక్ట్స్ ఏంటీ సినిమా రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం. కునాల్ కోహ్లీతో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఒకవేళ ఈ సినిమాలో నటించే అవకాశం దక్కకపోతే జీవితంలో చాలా కోల్పోయేదానిని అని తమన్నా పేర్కొన్నారు.

సందీప్ కిషన్‌, నవదీప్‌తో

సందీప్ కిషన్‌, నవదీప్‌తో

నెక్ట్స్ ఏంటీ సినిమాలో సందీప్ కిషన్, తమన్నా, నవదీప్ జంటగా నటించారు. ఈ చిత్రానికి కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించారు. ఫనా, హమ్ తుమ్ లాంటి చిత్రాలను అందించిన ఆయన అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X