Don't Miss!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- News
ఎమ్మెల్యే కోటంరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు - ఈ సారి నేరుగా...!?
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Tamannaah Bhatia ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తమన్నా భాటియా.. రొమాంటిక్ మూడ్‌లో మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డేటింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వర్థమాన నటుడు, విలన్ వేషాలతో రాణిస్తున్న ప్రతిభావంతుడైన నటుడు విజయ్ వర్మతో అతి సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.
అయితే విజయ్ వర్మతో అఫైర్ గురించి తమన్నా భాటియా ఎలాంటి కామెంట్ చేయకపోయినా.. ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించింది. అయితే న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకొన్న ఈ ప్రేమపక్షులు మరోసారి మీడియా కంటికి చిక్కారు. తమన్నా భాటియా అఫైర్ వ్యవహారంలోకి వెళితే...

తొలిసారి ముంబైలోని మ్యూజిక్ ఈవెంట్‌లో
తమన్నా, విజయ్ వర్మ అఫైర్ వ్యవహారం తొలిసారి ముంబైలో జరిగిన మ్యూజిక్ ఈవెంట్‌లో బయటకు వచ్చింది. నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ నిర్వహించిన మ్యూజిక్ కాన్సెర్ట్‌లో తమన్నా, విజయ్ వర్మ ఇద్దరు సన్నిహితంగా ఉంటూ మీడియాకు చిక్కారు. ఇటీవలే స్నేహితుల ద్వారా తమన్నా, విజయ్ మధ్య బంధం బలపడినట్టు తెలిసింది. ఈ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో వీరితోపాటు కార్తీక్ ఆర్యన్, అంగద్ బేడి కూడా ఉన్నారు.

విజయ్ వర్మతో మధుర క్షణాలను ఆస్వాదిస్తూ
దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ ఈవెంట్‌లో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందంగా ముస్తాబైన ఈ మిల్కీ బ్యూటీ కొత్త ప్రియుడు విజయ్ వర్మతో మధుర క్షణాలను ఆస్వాదిస్తూ కనిపించింది. మీడియా వీరిని కెమెరాలో బంధిస్తున్నా పట్టించుకోకుండా ఆనందంగా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఫోటోలుకు ఫోజులిచ్చింది. ఇక వారి ప్రేమయాణ అంతటితో ఆగలేదు. ఆ తర్వాత వారిద్దరూ గోవాలో రొమాన్స్‌లో మునిగి తేలారు.

తమన్నా, విజయ్ వర్మ గోవాలో
న్యూ ఇయర్ వేడుకలను తమన్నా, విజయ్ వర్మ గోవాలో ఘనంగా జరుపుకొన్నారు. తన స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో తమన్నా, విజయ్ వర్మ లిప్‌లాక్ చేసుకొంటూ కనిపించారు. గత కొద్దికాలంగా పెళ్లి వార్తలపై స్పందిస్తున్న మిల్కీ బ్యూటీ.. తన ప్రియుడితో ఘాటుగా కనిపించడం చర్చనీయాంశమైంది. తమన్నా, విజయ్ ముద్దుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ముంబైకి చేరుకొన్న మిల్కీ బ్యూటీ
గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో జోష్‌తో చేసుకొన్న తమన్నా, విజయ్ వర్మ... మరో మూడు రోజులు అక్కడే ఉన్నారు. తమన్నా తన స్నేహితులతో కలిసి రెండు, మూడు రోజుల పాటు గోవాలో సేద తీరారు. వేకేషన్ పూర్తి చేసుకొని మంగళవారం రాత్రి ముంబైకి చేరుకొన్నారు. తమన్నాతోపాటు విజయ్ వర్మ కూడా రావడంతో వారి మధ్య డేటింగ్ వ్యవహారానికి పక్కా రుజువులు దొరికాయి.

తమన్నా, విజయ్ వర్మ కలిసి ఎయిర్‌పోర్టులో
గోవా నుంచి ముంబైకి చేరుకొన్న తమన్నా, విజయ్ వర్మ కలిసి ఎయిర్‌పోర్టులో మీడియా కెమెరాలకు చిక్కారు. వీరిద్దరూ మీడియా కెమెరాలకు ఫోజులిస్తూ.. ఫోటోగ్రాఫర్లకు విషెస్ తెలియజేశారు. మీడియా ప్రతినిధులుకు చేతులు ఊపుతూ ఆనందంగా ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చే సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమన్నా వెనుకనే విజయ్ వర్మ రావడంతో ఫోటోగ్రాఫర్లు రెచ్చిపోయి ఫోటోలు తీసుకొన్నారు.

తమన్నా, విజయ్ వర్మ కెరీర్ గురించి
తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. 2022లో వరుస చిత్రాలతో మిల్కీ బ్యూటీ ఆలరించింది. ఘని, F3, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం సినిమాలతో ఆకట్టుకొన్నది. ఇక చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలోను, బోలే చూడియా, బాంద్రా చిత్రాల్లో నటిస్తున్నది. ఇక విజయ్ వర్మ విషయానికి వస్తే.. నాని నటించిన ఎంసీఏ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇటీవల అలియా భట్ నటించిన డార్లింగ్స్ చిత్రంలో నటించాడు.