Stree 2: స్త్రీ 2 మూవీలో మిల్కీ బ్యూటీ ఐటెం సాంగ్.. తమన్నా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
సినిమాల్లో మాస్ జనాల కోసం మేకర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారు . ఇందులో ఐటెం సాంగ్స్ ఒకటి. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో, హుషారెత్తించే మ్యూజిక్‌తో వచ్చే ఈ పాటలకు థియేటర్లు మోతెక్కిపోయేవి. స్పెషల్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. జయమాలిని, జ్యోతిలక్ష్మీ, అనూరాధ, సిల్క్‌స్మిత వంటి తారలు ఆ రోజుల్లో హీరోయిన్లతో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ పాటలు ఇప్పటికీ ఉత్సవాలు, ఈవెంట్‌లలో హల్‌చల్ చేస్తూనే ఉంటాయి.
ప్రజెంట్ ఈ ట్రెండ్ మారింది. హీరోయిన్లే స్వయంగా ఐటెం సాంగ్స్ వేస్తున్నారు. బాలీవుడ్‌లో మొదలైన ఈ కల్చర్ నెమ్మదిగా ఇతర ఇండస్ట్రీలకు సైతం విస్తరించింది. అనుష్క, కాజల్, సమంత, తమన్నా, శ్రీయా వంటి స్టార్ హీరోయిన్లు ఓ పక్క సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్‌తోనూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. వీరిలో తమన్నా అందరికంటే ముందున్నారు. అంతేకాదు.. ఈమె ఐటెం సాంగ్ చేస్తే ఖచ్చితంగా బొమ్మ బ్లాక్‌బస్టర్ అనే సెంటిమెంట్ సినీ జనాల్లో బలంగా నాటుకుపోయింది.

ఎన్టీఆర్ లవకుశలో స్వింగ్ జర, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను, మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరులో డాంగ్ డాంగ్, కేజీఎఫ్ చాప్టర్ -1, రీసెంట్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్‌లో నువ్ కావాలయ్యా వంటి సాంగ్స్ చేసింది మిల్కీబ్యూటీ. ఈ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలాఉండగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ - రాజ్ కుమార్ రావు కాంబినేషన్‌లో తెరకెక్కిన స్త్రీ-2 సంచలన విజయం నమోదు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో కామోడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి కీలకపాత్ర పోషించారు.
ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా.. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో డే బై డే స్క్రీనింగ్‌ను పెంచుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫైటర్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల రికార్డులను బద్ధలుకొట్టింది. స్త్రీ-2 విషయంలోనూ తమన్నా సెంటిమెంట్ మరోసారి నిజమైంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ.. ఆజ్ కీ రాత్ అంటూ వచ్చే స్పెషల్ సాంగ్‌లో నటించారు. తన నడుము ఒంపులు, కళ్లు చెదిరే స్టెప్స్‌తో అదరగొట్టింది.
ఆరేళ్ల క్రితం వచ్చి స్త్రీ పార్ట్-1లో నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేసింది. ఇప్పుడు ఆ పాటని, తమన్నా సాంగ్‌ని ఆడియన్స్ పోల్చి చూస్తున్నారు. నోరా ఫతేహి చేసిన కమారియా సాంగ్ విడుదలైన కాసేపటికే వైరల్‌గా మారి చార్ట్‌బస్టర్‌గా నిలిచి.. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 371 మిలియన్ల వీక్షణలను పొందింది. మీడియాలో సర్య్యూలేట్ అవుతోన్న దాని ప్రకారం.. 3 నిమిషాల నిడివిగల ఈ పాటలో నటించినందుకు గాను నోరా రూ.25 లక్షలను పారితోషికం కింద తీసుకున్నారట.

అయితే తమన్నా ఆజ్ కీ రాత్ సాంగ్‌కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్త్రీ-2కి భారీ హైప్ తీసుకొచ్చిన ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భాటియా భారీగానే పారితోషికం అందుకుందట. కేవలం 5 నిమిషాల నిడివిగల ఈ పాట కోసం ఆమె రూ.కోటి తీసుకున్నట్లు బాలీవుడ్ టాక్. అంటే నోరా ఫతేహి కంటే 4 రెట్లు అధికంగా వసూలు చేసిందన్నమాట.
అయితే తీసుకున్న పారితోషికానికి తగ్గట్లుగానే తమన్నా పడ్డ కష్టం కనిపించింది. విడుదలైన 3 వారాలకే ఆజ్ కీ రాత్ యూట్యూబ్‌లో 100 మిలియన్ల వీక్షణలను క్రాస్ చేసింది. అయితే స్పెషల్ సాంగ్‌తో పాటు స్త్రీ-2లో తమన్నా చిన్న గెస్ట్ రోల్‌లోనూ నటించింది. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని మిల్కీ బ్యూటీ అద్బుతంగా వర్కవుట్ చేస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











