Lust Stories 2 on OTT నా లవర్‌తో బెడ్‌రూమ్, లిప్‌లాక్స్ సీన్లలో అలా చెలరేగిపోయా.. తమన్నా భాటియా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ డేటింగ్ వ్యవహారం మీడియాలో సంచలనంగా మారింది. గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఈ జంట చేస్తున్న హంగామా భారీగానే ఉంది. అయితే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో పడక గది సన్నివేశాల్లో వీరిద్దరూ చెలరేగిపోయి నటించడం సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌గా నిలిచాయి. అయితే లస్ట్ స్టోరీస్ సినిమా రిలీజ్ ప్రమోషనల్‌లో ప్రియుడితో కలిసి బెడ్ రూమ్ సీన్లలో ప్రియుడితో కలిసి నటించడంపై తమన్నా భాటియా క్లారిటీ ఇస్తూ..
లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ కోసం నన్ను సంప్రదించినప్పుడు కథ, నా పాత్ర వివరాలను అడిగాను. అయితే వారు నాకు స్క్రిప్ట్ నేరేట్ చేశారు. ఆ తర్వాత స్క్రిప్టు పలుమార్లు తిరిగేశాను. అయితే నా పాత్రతో ముడిపడి ఉన్న బాయ్‌ఫ్రెండ్ క్యారెక్టర్‌తో సన్నిహితంగా ఉండే సీన్లు, పడకగది రొమాన్స్, లిప్‌లాక్స్ అన్నింటి గురించి నాకు చాలా సందేహాలు ఉండేవి అని తమన్నా తెలిపింది.

ఇక జూమ్ మీటింగ్ ద్వారా పాత్రల గురించి చర్చించినప్పుడు నాకు జంటగా నటించే వారు ఎవరని అడిగితే.. విజయ్ అని సమాధానం చెప్పారు. అయితే నేను విజయ్ దేవరకొండనా? అని అడిగాను. దాంతో వారు విజయ్ వర్మ అని జవాబిచ్చారు. దాంతో అయితే ఫర్వాలేదనే ఫీలింగ్ కలిగింది. కానీ విజయ్ దేవరకొండ ఉంటే బాగుండనిపించింది అని తమన్నా సమాధానం చెప్పింది.
లస్ట్ స్టోరీస్ 2 స్క్రిప్టు మనసులోకి ఎక్కించుకొన్న తర్వాత లెక్కకు మించిన ముద్దులు, ముద్దును మించిన ముద్దులు, బెడ్ రూమ్ సీన్లలో నటించడం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. నా సహ నటుడితో నేను ఎలా కెమిస్ట్రీని పండించాలా అని ఆలోచించాను. విజయ్ వర్మ ఇచ్చిన సపోర్టుతో ఫన్నీగా, హ్యూమర్‌గా అలాంటి సీన్లను ఫినిష్ చేశాను అని తమన్నా భాటియా అన్నారు.
విజయ్ వర్మతో నాకు రిలేషన్‌షిప్ ఉండటంతో సన్నిహితంగా ఉండే కౌగిలింతలు, లిప్‌లాక్స్ సన్నివేశాల్లో ఇబ్బంది కాలేదు. స్క్రిప్టు డిమాండ్ చేసినంత మేరకు నేను, విజయ్ పాత్ర గురించే ఆలోచించాం. మా మధ్యలో ఎలాంటి అనుమానాలు, బిడియం, సందేహాలు రాలేదు. అలా పడకగది సీన్లు చాలా కూల్‌గా గడిచిపోయాయి అని తమన్నా భాటియా అన్నారు.

లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో తమన్నా భాటియా, విజయ్ వర్మతోపాటు కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, తిలోత్తమ షోమ్, మృణాల్ థాకూర్, అంగద్ బేడీ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ తర్వాత తమన్నా భాటియా రొమాంటిక్ సీన్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. జూన్ 29న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నది.


Click it and Unblock the Notifications











