ఐటెం సాంగ్‌తో తమన్నా ప్రభంజనం... 100 కోట్లతో మిల్కీబ్యూటీ సరికొత్త చరిత్ర
తమన్నా భాటియా... పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు తమన్నా. ఈ జనరేషన్‌లో రెండు దశాబ్థాల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న నటిగా ఆమె అరుదైన గుర్తింపును సాధించారు. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్ చేస్తూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఈవిడ వేసిన బాటలోనే పలువురు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేస్తూ కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటున్నారు. తాజాగా ఐటెం సాంగ్ విషయంలో తమన్నా భాటియా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే...
20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా
ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా తమన్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. హిట్ , ఫ్లాప్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆమెకు ఆఫర్లు క్యూకడుతున్నాయి. ప్రస్తుతానికి తన ఫోకస్ బాలీవుడ్‌పైనే పెట్టారు తమన్నా. హిందీలో ఓ రోమియో, రేంజర్, రోహిత్ శెట్టి సినిమాలలో మిల్కీబ్యూటీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్‌లో తమన్నా ఉన్నారు.

ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా
ఇదిలాఉండగా... దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తమన్నా భాటియా హీరోయిన్‌గా గ్లామర్ ఒలికించడంతో పాటు హీరోయిన్లూ కూడా ఐటెం సాంగ్స్ చేయగలరనే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. కో అనే తమిళ్ చిత్రంలో తొలిసారిగా స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడారు మిల్కీ బ్యూటీ. ఆ తర్వాత అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవ కుశ, కేజీఎఫ్, సరిలేరు నీకెవ్వరు, గనీ, రైడ్ 2, జైలర్, స్త్రీ 2, రైడ్ 2 తదితర చిత్రాల్లో తమన్నా ఐటెం సాంగ్స్ కుర్రాళ్లను ఊపేశాయి. పాలరాతి శిల్పం లాంటి అందాలకు తోడు ప్రొఫెషనల్ డ్యాన్సర్ కావడంతో తమన్నా భాటియా స్పెషల్ నెంబర్స్ బాగా క్లిక్ అవుతున్నాయి. ఏకంగా చిన్నారులు కూడా తమన్నా ఐటెం సాంగ్స్ చూస్తేనే అన్నం తింటున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అప్పట్లో కలకలం రేగింది.
ఐటెం సాంగ్స్‌కి భారీ రెమ్యునరేషన్
సినిమా షూటింగ్స్ కోసం నెలలు కేటాయించి సంపాదించిన దానికంటే స్పెషల్ సాంగ్స్ మంచి లాభసాటిగా ఉండటంతో తమన్నా భాటియా దూసుకెళ్తున్నారు. ఒక్కో ఐటెం సాంగ్‌కు ఆమె భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. జైలర్‌లో స్పెషల్ సాంగ్‌కు 3 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న మిల్కీ బ్యూటీ.. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ మూవీలో గఫూర్ సాంగ్‌కు అక్షరాల 6 కోట్ల రూపాయలన రెమ్యునరేషన్‌గా అందుకుని ఇండస్ట్రీకి షాకిచ్చారు.
ఆజ్ కీ రాత్ సాంగ్ రికార్డ్
ఇదిలాఉండగా.. ఐటెం సాంగ్స్ చరిత్రలోనే తమన్నా భాటియా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. స్త్రీ2 మూవీలో ఆమె నర్తించిన ఆజ్‌కీ రాత్ సాంగ్ ఫస్ట్ వ్యూ నుంచి నేటి వరకు 1 బిలియన్ వ్యూస్ (100 కోట్ల వీక్షణలు) అందుకుని చరిత్ర సృష్టించింది. దీనికి సంబంధించి తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. మీ ప్రేమకు థ్యాంక్స్ అంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే.. ఆజ్ కీ రాత్ పాటకు అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించగా... సచిన్ - జిగార్‌లు సంగీత దర్శకత్వం వహించారు. మధుబంతి బాగ్చీ, దివ్య కుమార్, సచిన్- జిగార్‌లు ఆలపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమన్నా అభిమానులు ఆమె టాలెంట్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











