కరోనా బాధితుల కోసం మిల్కీబ్యూటీ విరాళం.. కాజల్ కంటే ఎక్కువే!
ప్రపంచం వ్యాప్తంగా రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టేందుకు అన్ని దేశాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ మరీంత పటిష్టంగా అమలు చేయబోతున్నారు. రీసెంట్ గా లాక్ డౌన్ ని పొడిగించింది విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమలో కూడా లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోయారు.
చాలా మంది సినీ కార్మికులకు సహాయం అందించేందుకు స్టార్స్ ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రిసిస్ చారిటీ ట్రస్ట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రస్ట్ కి హీరో హీరోయిన్స్ వారికి తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది సినిమా నటులు, టెక్నీషియన్స్ ట్రస్ట్ కి విరాళాలు అందించగా సీనియర్ హీరోయిన్స్ కాస్త నెమ్మదిగా వారి సహాయాన్ని అందిస్తున్నారు. రీసెంట్ గా మిల్కి బ్యూటీ తమన్నా భాటియా కూడా చారిటీ ట్రస్ట్ కి 3లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. హీరోయిన్స్ లో అందరికంటే ముందుగా లావణ్య త్రిపాఠి లక్ష రూపాయల అందించిన విషయం తెలిసిందే.
ఆ తరువాత కాజల్ అగర్వాల్ 2లక్షల ఆర్థిక సహాయాన్ని అంధించింది. ఇక ఇప్పుడు మిల్కి బ్యూటీ కూడా తనవంతు విరాళాన్ని అందించడంతో ఆమెను చూసి మరికొందరు ముందుకు రావాలని అభిమానులు కోరుతున్నారు. కరోనా వైరస్ నిర్ములన నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా మరో రెండు నెలల వరకు సినీ కార్మికులకు పని దొరకడం అనుమనంగానే ఉంది. దీంతో సినీ పెద్దలు ఈ విషయంపై ఇటీవల చారిటీ ట్రస్ట్ ని స్థాపించి పేద కార్మికులకు సహాయం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











