ఆ మహానటి బయోపిక్ నా కల.. తమన్నా ఆశ నెరవేరేనా ?

సౌత్‌లో మిల్కీబ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా ( Tamannaah Bhatia). ఈ నటి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేనిదే. దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన నటీమణి. 2005లో 'శ్రీ' మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు, తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్‌డమ్‌ను అందుకుంది.

లవ్ స్టోరీస్ నుండి యాక్షన్ ఎంటర్టైనర్‌ల వరకు ఎన్నో జానర్లలో నటిస్తూ, తన సొంత క్రేజ్‌ను సృష్టించింది. ప్రస్తుతం తమన్నా కేవలం తెలుగు సినిమాల్లోనే తమిళం, బాలీవుడ్, వెబ్ సిరీస్‌లు, పాన్ ఇండియా ప్రాజెక్టుల్లోప్రేక్షకులను అలరిస్తోంది. అయితే.. ఓ మహానటి బయోపిక్ లో లీడ్ రోల్ లో నటించాలనే తన కల అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ తమన్నా డ్రిమ్ ప్రాజెక్ట్ ఏంటీ? ఇక తమన్నా ఆశ నెరవేరేనా?

Tamannaah Bhatia Dreams of Playing Sridevi in a Biopic Calls It Her Iconic Role

టాలీవుడ్‌లో దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్రస్థానంలో నిలుస్తూ, స్టిల్ ఫుల్ డిమాండ్‌లో ఉన్న కథానాయిక తమన్నా భాటియా, ఇటీవలి కాలంలో ఐటమ్ సాంగ్స్, లేడీ ఓరియెంటెడ్ రోల్స్, కమర్షియల్ మూవీస్ నటిస్తూ.. ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకుంది. ఇటీవల తన మనసులో చాలా కాలంగా దాచుకున్న ఒక కలను బయటపెట్టింది. ఆమెకు ఎంతో అభిమానమైన ఐకానిక్ నటి శ్రీదేవి పాత్రలో తెరపై కనిపించడం తన డ్రీమ్ రోల్ అని స్పష్టంగా తెలిపింది. సినీ లోకంలో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి.. ఎంతోమంది స్టార్‌లకు ఆదర్శం. అదే జాబితాలో తానూ ఉన్నానని తమన్నా చెబుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. "శ్రీదేవి గారిని నేను ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉన్నాను. ఆమె స్టైల్, యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ నాకు ఇన్‌స్పిరేషన్. ఎప్పుడైనా ఐకానిక్ పాత్ర చేయాల్సి వస్తే అది శ్రీదేవి గారిదే. ఈ పాత్ర నా కల" అని తెలిపారు. తమన్నా ఇప్పటివరకు ఒక్క బయోపిక్ కూడా చేయలేదు. అయితే తనకు అవకాశం వస్తే ఎవరైనా జీవితకథ కాదు.. కేవలం శ్రీదేవి బయోపిక్ (SriDevi Biopic) మాత్రమే అని ఓపెన్ గా చెప్పేసింది.

ఇటీవల కాలంలో బయోపిక్ ట్రెండ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్, ధోని బయోపిక్, మేరీకోమ్ ఇలాంటి బయోగ్రాఫికల్ సినిమాలు ఇండియన్ సినిమా చెరగని గుర్తులను మిగిల్చాయి. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలు ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకే తమన్నా కూడా శ్రీదేవి బయోపిక్‌లో నటించాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

కానీ, ఈ కల సాకారం కావాలంటే.. శ్రీదేవి భర్త బోనీ కపూర్ అంగీకారం తప్పనిసరి. అయితే.. ఆయన శ్రీదేవి జీవితం గురించి ఏ సినిమాలోనూ చూపించనివ్వనని బహిరంగంగానే ప్రకటించారు. అందుకే ముందు జరిగిన ప్రయత్నాలే నిలిచిపోయాయి. అంటే... తమన్నా డ్రీమ్‌ నేరవేరాలంటే.. బోనీ కపూర్ అనుమతి కీలకం. మరీ తమన్నా ఆశ నేరవేరుతుందా? లేక కల గానే మిగిలిపోతుందా? అనే వేచి చూడాలి.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం తమన్నా 'ఓదెల 2' బిజీగా ఉన్నారు. ఇక తమన్నా త్వరలో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూ పొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఓ. రోమియో'లో షాహిద్ కపూర్ సరసన కనిపించనుంది. అలాగే 'వవన్ ఫోర్స్ ఆఫ్ ది ఫొరెస్ట్'లోనూ నటిస్తోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, టీవీఎఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది మేలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X