హీరోయిన్లను అలా చూపిస్తారు... సౌత్ ఇండస్ట్రీపై తమన్నా షాకింగ్ కామెంట్స్

దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి జీవితాన్ని మొదలుపెట్టిన ఎంతో మంది తారలు కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అయితే ఏరు దాటాక తెప్ప తగలేశామని అన్నట్లు.. టాప్ పొజిషన్‌కు చేరుకోగానే తాము ఎక్కడి నుంచి ఈ స్థాయికి చేరుకున్నాము? అందుకు కారణం ఎవరు? అనేది పూర్తిగా మరిచిపోయి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన తాప్సీ, రాధిక ఆప్టే, ఇలియానా వంటి ముద్దుగుమ్మలు దక్షిణాది ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటకట్టుకంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేరారు.

ఫోర్బ్స్ ఇండియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు అంటే చులకన భావం ఉంది, మా గురించి ఎలాంటి సానుకూల వాతావరణం లేదు. ఈ విషయంలో బాలీవుడ్ కొంత బెటర్. సౌత్‌లో హీరోయిన్లను కేవలం గ్లామర్ షో చేసే బొమ్మలుగా చూపించడం నాకు నచ్చలేదు. దీనికి తోడు అక్కడ మేల్ డామినేషన్ ఎక్కువ. హీరోయిన్లను తెరపై గౌరవంగా చూపించడంలో దక్షిణాది వెనుకే ఉంది. అయితే ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో పాటలు, డ్యాన్స్‌లకు ఇంపార్టెన్స్ పెరుగుతోంది.

Tamannaah Bhatia Faces Backlash Over South Industry Remarks

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలిరోజుల్లోనే పాటలు, డ్యాన్స్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని గుర్తించా. అయితే బాలీవుడ్‌లో రెండు రకాల హీరోయిన్లు ఉంటారు. ఒకరు గ్లామర్ పాత్రలు చేస్తే, రెండో రకం నటనకే అంకితమవుతారు. వారు తప్పనిసరిగా గ్లామర్ షో చేయాలని లేదా డ్యాన్స్ చేయాలని లేదు. వాస్తవానికి హిందీ చిత్ర పరిశ్రమ ఈ రెండింటిలో దేనినైనా ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ రెండు చేయగలిగితే బాలీవుడ్‌ వారిని సూపర్‌స్టార్స్‌గా నెత్తిన పెట్టుకుంటుంది. కానీ దక్షిణాదిలో మాత్రం గ్లామర్ షో, డ్యాన్స్‌లు రెండూ చేయగలిగిన వారే అక్కడ స్టార్లుగా ఎదుగుతారు. ఇక్కడ 10-15 ఏళ్లుగా హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారు నటనకు స్కోప్ ఉన్న పాత్రలతో గ్లామరస్ పాటలు, డ్యాన్స్‌‌తో సమన్వయం చేసుకున్నవారేనని తమన్నా వెల్లడించారు.

దక్షిణాదిలో సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించాలంటే స్టార్స్ ఉండాల్సిందేనని తమన్నా అభిప్రాయపడ్డారు. ఇక తాను ఐటెం సాంగ్స్ చేయడంపై స్పందిస్తూ వాటిని ఐటెం సాంగ్స్‌గా కంటే పార్టీ సాంగ్స్‌గా చూస్తా. కరీనా కపూర్, కత్రినా కైఫ్‌లను ఇందుకు తమన్నా ఉదహరించారు. సినిమాల కంటే పాటలే జనానికి బాగా గుర్తుంటాయని చెప్పారు. సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ చమ్మక్ చల్లో, షీలాకీ జవానీ వంటి సాంగ్స్ ప్రజల్లో ఆదరణను పొందాయని తమన్నా గుర్తుచేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

ఉత్తరాదికి చెందిన తమన్నా భాటియా చిన్న వయసులోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆమెకు హీరోయిన్‌గా వరుస అవకాశాలను, టాప్ పొజిషన్‌ను ఇచ్చింది దక్షిణాది పరిశ్రమ. తెలుగులో శ్రీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత హ్యాపీడేస్, రచ్చ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఎందుకంటే ప్రేమంట, బాహుబలి సిరీస్, సైరా నర్సింహారెడ్డి, ఎఫ్ 2, ఎఫ్ 3 తదితర సినిమాలతో అగ్రనటిగా టాలీవుడ్‌లో దూసుకెళ్లారు తమన్నా. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ తదితర సినిమాలతో అక్కడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ జనరేషన్‌లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న హీరోయిన్లలో ఒకరిగా తమన్నా భాటియా నిలిచారు. హిందీ ఇండస్ట్రీలో తమన్నా సినిమాలు అంతగా సక్సెస్ కానప్పటికీ సౌత్ ఇండస్ట్రీ అండగా నిలిచి ఆదుకుంది. ఎప్పుడైతే జైలర్ 2లో ఆమె చేసిన నువ్వు రావాలయ్య సాంగ్ పాపులర్ అయ్యిందో నాటి నుంచి హిందీలో స్పెషల్ సాంగ్స్‌కి తమన్నాకి అవకాశాలు పోటెత్తాయి. స్త్రీ 2, రైడ్ 2 తదితర సినిమాలలో ఆమె సాంగ్స్ దేశాన్ని ఊపేశాయి. ఈ ఫేమ్‌తో ప్రస్తుతం దక్షిణాదిని వదిలేసి పూర్తిగా బాలీవుడ్‌కే అంకితమయ్యారు తమన్నా భాటియా. ప్రస్తుతం హిందీలో వివాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, వి శాంతారామ్, రాగిణి 3, జగన్ శక్తి, రోహిత్ శెట్టి సినిమాలలో తమన్నా నటిస్తున్నారు.

హిందీ సినిమాలతోనే నటిగా తమన్నా తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఆమెకు స్టార్‌డమ్ దక్కింది అనేది బహిరంగ రహస్యం. దాదాపు రెండు దశాబ్ధాల కెరీర్‌లో ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె కెరీర్‌లో 90 శాతం సినిమాలు దక్షిణాదిలో నటించినవే.. సౌత్‌లో 80 సినిమాలలో నటిస్తే, హిందీలో కేవలం 15 సినిమాలలో మాత్రమే తమన్నా నటించారు. అలాంటిది తనకు ఇంతటి గుర్తింపును, జీవితాన్ని ఇచ్చిన దక్షిణాది చిత్ర పరిశ్రమను కేవలం బాలీవుడ్ విసిరే కొన్ని ఐటెం సాంగ్స్ కోసం తప్పుబట్టడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. హిందీ ఐటెం సాంగ్స్‌లో అక్కడి మేకర్స్ తమన్నాను ఎంత గ్లామరస్‌గా చూపించింది స్క్రీన్ షాట్స్ పెట్టి మరి మండిపడుతున్నారు నెటిజన్లు. మరి ఈ వ్యాఖ్యలపై తమన్నా ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more about: tamannaah bhatia movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X