ఆ ఇద్దరు క్రికెటర్లతో తమన్నా అఫైర్... మిల్కీ బ్యూటీ ఏం చెప్పిందంటే?

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై కొద్ది రోజులుగా జరుగున్న ప్రచారానికి అప్సెట్ అయ్యింది. స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, అబ్దుల్ రజాక్ లతో లింక్ చేస్తూ డేటింగ్ రూమర్లను కొందరు గుప్పుమనిపించారు. గతంలో ప్రారంభమైన ఈ రూమర్ ఇటీవల మీడియా సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయం తమన్నా భాటియా వరకు చేరుకుంది. దీంతో ఆమె ఇటీవలి ఇంటర్వ్యూలో ఆ రూమర్లపై స్పందించింది. అసలు జరిగిందేంటో చెప్పే ప్రయత్నం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

కింగ్ కోహ్లీతో డేటింగ్?
సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నటి తమన్నా భాటియా. ఈ క్రమంలో ఆమె చాలా మంది అగ్ర హీరోలు, ప్రముఖ దర్శకులతో కలిసి పని చేసింది. ఇదే సమయంలో ఇండియాలోని ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న వారితోనూ పలు కమర్షియల్ యాడ్స్ లోనూ నటించింది. ఇదే సమయంలో తమన్నా భాటియా స్టార్ క్రికెటర్ కోహ్లీతో కలిసి 2012లో ప్రముఖ మొబైల్ కంపెనీకి సంబంధించిన కమర్షియల్ యాడ్ లో నటించారు. అప్పట్లో ఆ యాడ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆ తర్వాత నుంచి డేటింగ్ రూమర్లు పుట్టుకొచ్చాయి.

Tamannaah Bhatia finally Reacted on Link up Rumours with Virat Kohli and Abdul Razzaq

పాకిస్తాన్ క్రికెటర్ తో పెళ్లి?
అలాగే పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో పెళ్లి అంటూ తెగ ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి జ్యూవెల్లరీ షాప్ లో గోల్డ్ కొనుగోలు చేస్తున్నట్టు, అది వారి పెళ్లికే అన్నట్టు ఏదేదో ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట జోరుగా వ్యాప్తి చెందాయి. ఇక విషయం కూడా తమన్నా చెవిన పడింది. దీంతో ఆమె ఇటీవల ఇలా స్పందించింది. అవన్ని కట్టు కథలన్నీ కొట్టి పారేసింది. ఇక తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

తమన్నా భాటియా క్లారిటీ..
రీసెంట్ గా తమన్నా భాటియా మాట్లాడుతూ.. కింగ్ కోహ్లిని అసలు నేను కలిసిందే లేదు. ఒకే ఒకసారి కోహ్లీని కలిశాను. అది కూడా ఒక్కరోజే షూటింగ్ కోసం కలిశాను. అంతకు ముందు, ఆ తర్వాత అసలు కలిసిందే లేదు. ఇలాంటి రూమర్లన్నీ పుట్టుకు రావడం బాధాకరం. ఇక అబ్దుల్ రజాక్ తో సీక్రెట్ పెళ్లి కూడా అవాస్తవం. ఇంటర్నెట్ లో ఇలాంటివి పుట్టుకొస్తూనే ఉంటాయి. దానికి మనం ఏమీ చేయలేం. ఎవరైనా దేని గురించి ఎలా ఆలోచించాలనుకుంటే అలానే ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరిని మనం కూర్చొని నియంత్రించ లేము. దానికి సమయం పడుతుంది.' అని క్లారిటీ ఇచ్చారు తమన్నా భాటియా.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
తమన్నా భాటియా చివరిగా తెలుగులో మెగా స్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ లో నటించింది. ఓదెల 2, అంతకు ముందు జైలర్ చిత్రంలో కామియో రోల్, స్పెషల్ సాంగ్ తో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో రైడ్ 2 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నెక్ట్స్ తమన్నా భాటియా రేంజర్, ఐపీఎస్ మారియా, వీవ్యాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X