బ్రేకప్‌పై మౌనం వీడిన తమన్నా భాటియా.. ఆయనతో అలాంటి డేంజర్ అంటూ!

సినీ రంగంలో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న అరుదైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. నటిగానే కాకుండా ఐటెం సాంగ్స్‌తోనూ ఆమె మెప్పిస్తున్నారు. ఆమెతో పాటు కెరీర్ ప్రారంభించిన ఎంతోమంది నటీమణులు ఫేడ్ అవుట్ అయిపోగా.. తమన్నా మాత్రం ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో ఆమె మోస్ట్ వాంటెడ్ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.

తమన్నాకు వ్యక్తిగతంగా ఇబ్బందులు
కెరీర్ పరంగా తమన్నా‌కు ఎలాంటి ఇబ్బందులేవు. మరికొంతకాలం పాటు ఆమె హవా భారతీయ సినిమా రంగంలో స్పష్టంగా ఉంటుంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం తమన్నా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ ఆమె జీవితంపై ప్రభావం చూపింది. గతంలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే తమన్నా భాటియా.. ఇటీవలి కాలంలో తన పనులు, షూటింగ్స్ మీద ఎవరితోనూ పెద్దగా కలవడం లేదు. ఎంతో ముఖ్యమైతేనే వెళ్తోంది. ఇల్లు, షూటింగ్స్, వ్యాపారాలు తప్పించి మరేం పట్టించుకోవడం లేదు.

Tamannaah Bhatia first time opened about Breakup with Vijay Verma

వారితో తమన్నా డేటింగ్ అంటూ రూమర్స్
అందరి హీరోయిన్ల మాదిరిగానే తమన్నా భాటియా కెరీర్‌లోనూ పలు రూమర్స్ వచ్చాయి. పలువురు హీరోలతో పాటు క్రీడాకారులతో తమన్నా భాటియా రిలేషన్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వచ్చాయి. వీరిలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో పాటు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేర్లు కూడా వినిపించాయి. 20 ఏళ్ల కెరీర్‌లో ఎందరో సూపర్ స్టార్స్‌తో నటించారు. గ్లామరస్ రోల్స్‌కు ఎలాంటి అభ్యంతరం చెప్పని తమన్నా.. రొమాంటిక్ సీన్స్, ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే లస్ట్ స్టోరీస్ 2 మూవీలో తమన్నా రెచ్చిపోవడం అనేకా అనుమానాలకు తావిచ్చింది.

విజయ్ వర్మతో ప్రేమాయణం
లస్ట్ స్టోరీస్ 2లో తనతో కలిసి నటించిన విజయ్ వర్మతో తమన్నా భాటియా ప్రేమాయణం సాగిస్తున్నారని బీటౌన్ మీడియా కోడై కూసింది. ఇందులో విజయ్‌తో లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్ కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి. విజయ్‌తో ప్రైవేట్ పార్టీలు, డేట్స్, విహారయాత్రలకు వెళ్తూ తమన్నా పలుమార్లు మీడియాకు దొరికిపోయింది. అయినప్పటికీ వీరు తమ రిలేషన్ మాత్రం బయటపెట్టలేదు. అయితే వీరిద్దరూ వేర్వేరుగా తాము డేటింగ్‌లో ఉన్నామని అంగీకరించారు. ఇక నాటి నుంచి ఇద్దరూ బహిరంగంగానే తిరిగారు.

విజయ్ వర్మతో బ్రేకప్
దాదాపు మూడేళ్ల పాటు విజయ్ వర్మ - తమన్నా భాటియాలు డేటింగ్‌లో మునిగితేలారు. పెళ్లి చేసుకుని గుడ్‌న్యూస్ చెబుతారని అంతా భావిస్తుండగా.. సెడన్‌గా బ్రేకప్ చెప్పుకుని అందరికీ షాకిచ్చింది ఈ జంట. తమన్నా- విజయ్‌ల మధ్య బ్రేకప్‌కు దారి తీసిన కారణాలపై మీడియాలో అనేక కథనాలు ప్రసారమయ్యాయి. అయితే పెళ్లి చేసుకుని త్వరలో సెటిలవ్వాలని తమన్నా పట్టుబట్టగా.. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని విజయ్ వర్మ నిర్ణయించుకోవడం వల్లే ఈ జంట విడిపోయిందని బీటౌన్ మీడియా వాదిస్తోంది. బ్రేకప్ తర్వాత ఎవరి దారులు వారివి అయ్యాయి.

ఆ వ్యక్తి చాలా డేంజర్
కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ప్రేమ, రిలేషన్, బ్రేకప్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు తమన్నా భాటియా. కెరీర్‌లో రెండు సార్లు తన హృదయం ముక్కలైందన్నారు. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడే తొలిసారి ప్రేమలో పడ్డానని కానీ అనివార్య కారణాలతో అప్పుడే బ్రేకప్ జరిగిందని చెప్పింది. కోరుకున్న వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నచ్చలేదని... మనిషిగా జీవితంలో ఎంతో సాధించాలని అనుకోవడం వల్ల ఆ బంధం నిలబడలేదని తమన్నా తెలిపారు. ఆ తర్వాత మరో వ్యక్తితో కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నానని.. కానీ ఆ వ్యక్తి నాకు సరైన వ్యక్తి కాదనిపించింది. అలాంటి వ్యక్తితో బంధం ఎంతో ప్రమాదకరమని గ్రహించానని తమన్నా చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమన్నా చెప్పింది విజయ్ వర్మ గురించేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X