Tamannaah Bhatia: తమన్నాకు పబ్లిక్‌గా ముద్దుపెట్టిన అభిమాని.. మిల్కీబ్యూటీకి ఊహించని షాక్

భారతదేశంలో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటీనటులను ఇలవేల్పులుగా పూజిస్తారు ప్రేక్షకులు. హీరోయిన్లకు గుడికట్టి పూజించిన వారు ఉన్నారు. అభిమాన తారలతో సెల్ఫీలు దిగి.. ఒక్క ఆటోగ్రాఫ్ తీసుకుంటే చాలు జన్మధన్యం అన్నట్లుగా ఫీలైపోతారు ఫ్యాన్స్. అయితే అభిమానుల ఓవరాక్షన్ కారణంగా పబ్లిక్ ప్లేస్‌లలోకి తారలు రావాలంటేనే భయపడుతున్నారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా భాటియాకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఈ జనరేషన్‌లో వెండితెరపై హీరోయిన్ల కెరీర్ ఎంతకాలం సాగుతుంది అంటే చెప్పలేని పరిస్ధితి. హిట్లు పడి, మంచి సక్సెస్‌లు అందుకుంటే ఐదారేళ్ల పాటు హవా చూపించవచ్చు. అలాంటిది దాదాపు 20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెండితెరపై వెలుగొందుతున్నారు తమన్నా భాటియా. తనతో పాటు కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మలంతా పెళ్లి చేసుకోవడమో, ఫేడ్ అవుట్ కావడమో జరిగిపోయింది. కానీ తమన్నా మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా డేట్స్ కోసం నిర్మాతలు పోటీపడుతున్నారు.

Tamannaah Bhatia Gets Unexpected Kiss From Fan Girl at Public Event

కాలానికి తగినట్లుగా మారడం, ప్రేక్షకుల నాడిని పట్టి నడుచుకోవడం వల్లే తమన్నా ఇప్పటికీ తన మార్కెట్, డిమాండ్ కాపాడుకోగలుగుతున్నారు. హీరోయిన్ పాత్రలే చేస్తానని కూర్చోకుండా ఎలాంటి రోల్‌కైనా ఆమె సై అంటారు. అవసరమైతే గెస్ట్ రోల్స్ కూడా చేసి అలరించింది. ఇక ఈ జనరేషన్‌లో ఐటెం సాంగ్స్‌కు తమన్నా కేరాఫ్‌గా మారారు. జైలర్, స్త్రీ 2, రైడ్ 2, స్పీడున్నోడు, సరిలేరు నీకెవ్వరు తదితర చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఇండస్ట్రీని షేక్ చేశారు. పాల మీగడ లాంటి అందంతో పాటు డ్యాన్స్‌లో ఎక్స్‌పర్ట్ కావడంతో తమన్నాకు స్పెషల్ నెంబర్స్‌లో తిరుగులేకుండా పోయింది. ఈ పాటలకు కోట్లలో రెమ్యునరేషన్ వసూలు చేస్తూ ఇలా కూడా సంపాదించొచ్చా అని నిరూపించింది. ప్రస్తుతం హిందీలో భోలే చూడియన్, తెలుగులో దట్ ఈజ్ మహాలక్ష్మీ చిత్రాలలో మిల్కీ బ్యూటీ నటిస్తున్నారు.

కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటూ తన సంపాదనను జాగ్రత్తగా పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నారు తమన్నా. రియల్ ఎస్టేట్‌తో పాటు అనేక రంగాలలో ఆమె ఇన్వెస్ట్ చేస్తున్నారు. సొంతంగా ఆభరణాల బిజినెస్‌తో పాటు మరికొన్ని వ్యాపారాలు నడిపిస్తూ బిజినెస్‌ఉమెన్‌గానూ సత్తా చాటుతున్నారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం తమన్నా ఇబ్బందులు పడ్డారు. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన తమన్నా.. మూడేళ్లపాటు ఆయనతో డేటింగ్ చేశారు. రేపో మాపో పెళ్లి అనగా.. ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి తమన్నా ఒంటరిగా ఉంటున్నారు.

పబ్లిక్ ఈవెంట్స్‌కు, ఇతర వేడుకలకు క్రమం తప్పకుండా హాజరవుతారు తమన్నా భాటియా. తాజాగా ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఆమె అందరిలో జోష్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ డ్యాన్స్ బృందం.. స్త్రీ 2లో తమన్నా చేసిన ఆజ్‌కి రాత్ సాంగ్‌కి డ్యాన్స్ చేసింది. వారి డ్యాన్స్‌కి ముచ్చటపడిన తమన్నా.. వెంటనే స్టేజ్ మీదకి వెళ్లి ఆ బృందంతో కలిసి డ్యాన్స్ చేసింది. వారిలో తమన్నాకు వీరాభిమాని అయిన ఓ అమ్మాయి కూడా ఉండి. తన అభిమాన నటి.. తనతో కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. ఆ వెంటనే మిమ్మల్ని ఒకసారి ముద్దుపెట్టుకోవచ్చా అని తమన్నా అనుమతి తీసుకుని.. ఆమెను ముద్దాడి గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయ్యింది. ఆమె ప్రేమకు ఫిదా అయినా తమన్నా వెంటనే ఆ యువతి బుగ్గపై ముద్దుపెట్టి.. కెరీర్‌లో పైకి రావాలని దీవించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: tamannaah bhatia movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X