స్నానం చేశాక తమన్నాకు చిత్రమైన అలవాటు.. మిల్కీ బ్యూటీ ఏం చేస్తుందో తెలుసా?

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మంచు మనోజ్ 'శ్రీ' చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 20 ఏళ్ల కింద తమన్నా కెరీర్ ప్రారంభమైంది. ప్రస్తుతం సౌత్, నార్త్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. తెలుగులో తమన్నా భాటియాకు 'హ్యాపీ డేస్', '100% లవ్', 'బద్రీనాథ్', 'ఊసరవెళ్లి', 'రచ్చ', 'కెమెరా మెన్ గంగతో రాంబాబు', 'రెబెల్' వంటి సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

జక్కన్న 'బాహుబలి'తో ఏకంగా నేషన్ వైడ్ గా తమన్నాకు క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత నుంచి బాలీవుడ్ వైపు మొగ్గుచూపింది. అప్పటికే హిందీలో పలుచిత్రాల్లో మెరిసిన తమన్నా ఇక ప్రస్తుతం అక్కడే వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. తెలుగులోనూ జోరు తగ్గకుండా చూసుకుంటోంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్న తమన్నా ఎప్పుడూ ఏదోలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే తాజాగా తమన్నా గురించి ఓ సీక్రెట్ వినిపిస్తోంది. రీసెంట్ గా తానే ఓ ఇంటర్వ్యూలో స్వయం చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

Tamannaah Bhatia has a funny habit after taking a bath Do you know what is that

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా కు ఓ విఛిత్రమైన అలవాటు ఉన్నట్టు తెలిపింది. ఇటీవల తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకున్న ఆ అలవాటు గురించి ఓపెన్ అయ్యింది. స్నానం చేశాక తమన్నా భాటియా ఇలా చేస్తుందంట.. ఫుల్ డే వర్క్ చేస్తే మాత్రం.. స్నానం చేశాక తన బాడీలోని ప్రతి పార్ట్ ను టచ్ చేసి థ్యాంక్యూ చెప్తుందంట. ఇది వినాడానికి వింతగానే ఉంటుంది.. కానీ ఎందుకు అలా చేయకూడదు. బాడీలోని ప్రతి భాగం మనకు సహకరిస్తున్నందుకు అలా చేయడంలో తప్పేమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది.

అయితే.. తమకు ఇలాంటి భిన్నమైన అలవాటు ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి తమన్నా తన హెల్తీపైన ఎంత శ్రద్ధ వహిస్తుంటారో ఆమె అలవాటు ద్వారా తెలుస్తుందోని అంటున్నారు. ఇక తమన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దక్షిణాదిన, ఉత్తరాదిన ఊపూపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎక్కువగా స్పెషల్ అపీయరెన్స్ తో అదరగొడుతోంది. ఇటీవల తమన్నా నుంచి వచ్చిన 'ఆజ్ కీ రాత్' సాంగ్ ఎంత సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. అంతకు ముందు రజినీకాంత్ 'జైలర్' చిత్రంలో 'నువ్వు కావాలయా' అనే సాంగ్ తోనూ ఇండస్ట్రీలో సంచనలంగా మారింది.

Tamannaah Bhatia has a funny habit after taking a bath Do you know what is that

ప్రస్తుతం తమన్నా సినిమాలో పాటు టీవీ సిరీస్ ల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది. కాస్తా బోల్డ్ సీన్లతోనూ మతులు పోగొడుతున్న సంగతి తెలిసిందే. జీ కర్దా.. సిరీస్ ల్లో తమన్నా నటన ఆడియెన్స్ ను కట్టిపడేసిందనే చెప్పాలి. మరోవైపు గ్లామర్ డోస్ పెంచుతూ తమన్నా తన సెకండ్ ఇన్నింగ్స్ కు బ్రేక్స్ లేవని చెప్పింది. ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తెలుగులో సంపత్ నంది నుంచి వస్తున్న 'ఓదెల 2'లో నటిస్తోంది. అలాగే హిందీ టెలివిజిన్ సిరీస్ 'డార్లింగ్ పార్ట్ నర్స్'లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Read more about: tamannaah bhatia
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X