గజం కూడా కొనను .. హైదరాబాద్‌‌పై తమన్నా షాకింగ్‌ కామెంట్స్

గత కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. విజయ్ వర్మతో బ్రేకప్ ఇందుకు కారణం. పెళ్లి చేసుకోవాల్సిన జంట ఇలా ఆకస్మాత్తుగా విడిపోవడంతో ఏం జరిగిందోనని సినీ ప్రముఖులు , అభిమానులు షాక్ అవుతున్నారు. ఏ కారణం చేత వీరిద్దరూ విడిపోయారో తెలియ అంతా తలలు పట్టుకున్నారు. చూస్తుండగానే రోజులు గడిచిపోతుండగా తమన్నా, విజయ్ ఎవరి పనుల్లో వారు బిజీ అవుతున్నారు. ఈ బ్రేకప్ కారణం చేత తమన్నా ఏం మాట్లాడినా, ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యింది. రెండు దశాబ్ధాలలోనూ ఆమె స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ఇప్పటికీ ఇండియాలో మోస్ట్ వాంటేడ్ హీరోయిన్స్‌లో తమన్నా ఒకరు. ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యిందంటే తమన్నా కూడా ఆశ్చర్యపోతున్నారు. 15 ఏళ్ల వయసులోనే 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో తమన్నా భాటియా వెండితెరపై అడుగుపెట్టారు.

Tamannaah Bhatia has no properties in Hyderabad why odela 2 actress not buy plot in Telangana capital

పదో తరగతి చదువుతున్నప్పుడే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని .. కాలేజీకి వెళ్లనప్పటికీ సినిమాల్లో మాత్రం విద్యార్ధినిగా నటించానని తమన్నా గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభించనప్పుడు నటిగా ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉంటానని అనుకోలేదని.. కానీ తాను నటనను వృత్తిగానే కాకుండా ఇష్టపడి ఎంతో సంతోషంగా చేశానని మిల్కీ బ్యూటీ తెలిపారు.

2005లో మంచు విష్ణు హీరోగా వచ్చిన శ్రీతో తెలుగువారిని పలకరించిన తమన్నా భాటియాకు హ్యాపీడేస్‌తో బ్రేక్ వచ్చింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రాలతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. టాలీవుడ్‌తో కోలీవుడ్‌లోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచారు. అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన హిమ్మత్‌వాలాతో తిరిగి బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది తమన్నా. హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవ కుశ, కేజీఎఫ్ 1, సరిలేరు నీకెవ్వరు, జైలర్, స్త్రీ 2 సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి యూత్‌ని ఊపేశారు.

20 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో తమన్నా నటించినప్పటికీ తెలుగులోనే ఆమె స్టార్ డమ్ అందుకున్నారు. తనకు టాలీవుడ్ ఎంతో స్పెషల్ అని తమన్నా పలుమార్లు చెప్పారు కూడా. నిన్నగాక మొన్న వచ్చిన హిందీ హీరోయిన్లు హైదరాబాద్‌లో సొంతంగా ఇళ్లు కొనేస్తుంటే .. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా వెలుగుతున్న తమన్నాకు భాగ్యనగరంలో గజం స్థలం కానీ, ఇల్లు కానీ లేదు.

ఈ విషయంపై తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ట్రావెలింగ్ అంటే ఇష్టమని, పైగా షూటింగ్స్ రీత్యా ఒక చోట ఉండనని తెలిపారు. తన తల్లిదండ్రులు ముంబైలోనే ఉంటారు కాబట్టి అక్కడ ఇల్లు ఉందని .. అందుకే హైదరాబాద్‌లో కొనాలని అనుకోలేదని తమన్నా కుండబద్ధలు కొట్టారు. ప్రస్తుతం తమన్నా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X