For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ కులం దానిని, అలా చేస్తానా? అందరూ అలా అడిగితే ఇబ్బందిగా ఉంది... తమన్నా

  |
  Tamannaah Bhatia Responds On Reports Of Buying An Expensive Flat || Filmibeat Telugu

  మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేతిలో అనుకొన్నంత అవకాశాలు లేకపోయినా విలాసవంతమైన జీవితానికి ఏం తక్కువ కానివ్వడం లేదు. ఇటీవలే ముంబైలో సొంత ఇంటి కలను సాకారం చేసుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఇంటి కోసం వెచ్చించిన వ్యయం మాత్రం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొనుగోలు చేయాల్సిన మొత్తం కంటే రెండితల డబ్బు పెట్టిందనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తాజాగా తన ఇంటికి కోసం పెట్టిన ఖర్చుపై సెన్సేషనల్‌గా స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

  డబుల్ రేటుకు ఫ్లాట్

  డబుల్ రేటుకు ఫ్లాట్

  నా ఇంటిని ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేశాననే వార్త నా దృష్టికి వచ్చింది. నా స్కూల్ టీచర్ కూడా నాకు మెసేజ్ చేసి ఎందుకలా చేశావని అడిగారు. చాలా మందికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాను. ఇంటికి డబుల్ రేట్ పెట్టడానికి పిచ్చిదానినా? అసలే నేను సింధీ కులానికి చెందిన దానిని. నేను ఎలా రెండింతలు ఎక్కువగా పెట్టి ఇల్లు కొంటానని అనుకొన్నారు అని తమన్నా పేర్కొన్నది. సాధారణంగా సింధీలు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, ప్రాణం పోయినా పైసా పోనివ్వరనే చెప్పుకోవడం తెలిసిందే.

  ఎక్కువ రేటుకు కొనలేదని

  ఎక్కువ రేటుకు కొనలేదని

  నా ఇంటికి పెట్టిన ధరపై ప్రతీ ఒక్కరు అడగడం చాలా ఇబ్బంది పడ్డాను. ఇంటికి నేను ఎక్కువ రేటు పెట్టలేదు. ఇంకా ఇంటిలో కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులు పూర్తయిన తర్వాత నా తల్లిదండ్రులతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్తాను. నాకు సాధారణ జీవితం గడపటం ఇష్టం. ఇళ్లు మాత్రం ఆర్టిస్టిక్‌గా ఉండాలని కోరుకొంటాను. ఇంట్లో కొన్ని డిజైనింగ్ పనులు కొనసాగుతున్నాయి అని తమన్నా చెప్పింది.

  తమన్నా కొత్త ఇంటి వివరాలు

  తమన్నా కొత్త ఇంటి వివరాలు

  ముంబైలో వెర్సొవాలోని 22 అంతస్తుల ఓ అపార్ట్‌మెంట్‌లో చదరపు ఫీట్ ఒక్కంటికి 80,778 రూపాయలతో ఫ్లాట్‌ను తమన్నా కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇంటిలో నుంచి ఎటువైపు చూసినా సముద్రం చక్కగా కనిపిస్తుంది. అలాంటి ఇంటిలో భారీగా ఇంటీరియర్ డిజైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. తనకు నచ్చిన విధంగా ఇంటిని ఆమె ముస్తాబు చేయిస్తున్నది అని సినీ వర్గాలు వెల్లడించాయి.

   తమన్నా భాటియా కెరీర్ గురించి

  తమన్నా భాటియా కెరీర్ గురించి

  కెరీర్ పరంగా, రాజుగారి గది3 చిత్రంలో నటించాల్సింది. కానీ స్క్రిప్టు నచ్చలేదనే కారణంతో తమన్నా ఆ సినిమా నుంచి తప్పుకొన్నది. క్వీన్ రీమేక్ చిత్రం ఇంకా విడుదల కావాల్సింది. ఇక హిందీలో బోలే చుడియాన్ అనే చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటిస్తున్నది. బేలే చుడియా నటన పూర్తిగా ఆస్కారం ఉన్న చిత్రం. నవాజ్ లాంటి హీరోతో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని తమన్నా చెప్పింది.

  English summary
  Actress Tamannaah Bhatia bought a flat in Mumbai. Report suggest that for Rs 80,778 per sqft in Versova. But actress condemns the news and says that "I’m Sindhi, how can I pay double the price for an apartment?"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X