శ్రీదేవి అవార్డు అందుకోవడం బాధగా ఉంది.. తమన్నా
6వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జెఆర్.సీ కన్వెన్షన్ సెంటర్లో ఆట పాటలతో..తారల తళుకుబెళుకుల నడుమ అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జానకి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇంకా పలువురు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు...రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు అవార్డులు అందిచడం జరిగింది.

తమన్నా మాట్లాడుతూ, కొన్ని అవార్డులు అందుకుంటే సంతోషంగా ఉంటుంది. కానీ శ్రీదేవి పేరు మీద అవార్డు అందుకోవడం కొంచెం బాధగా ఉంది. కానీ ఈ ఏడాది ఆమె పేరు నేను అవార్డు అందుకోవడం అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ జ్ఞాపకం.
చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సురేష్ గారికి కృతజ్ఞతలు అని అన్నారు.


Click it and Unblock the Notifications











