Breakup: విజయ్‌తో తెగతెంపులు.. తమన్నా క్రేజీ కామెంట్స్
కొన్నాళ్ల కితం వరకు తెలుగు సినిమాలో ఒక రేంజ్ లో షైన్ అయ్యిన టాప్ మోస్ట్ బ్యూటీస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ కూడా వేరు. మరి తమన్నా హీరోయిన్ గా దాదాపు తెలుగులో అనేకమంది స్టార్ హీరోస్ సరసన చేసేసింది. అంతే కాకుండా తమిళ నాట కూడా అక్కడ బిగ్ స్టార్స్ సరసన కెరీర్ స్టార్టింగ్ లోనే సినిమాలు చేసేసి ఫుల్ బిజీగా మారింది.
కానీ తర్వాత అందరి హీరోయిన్స్ లానే తన స్టార్డంకి కూడా కొంచెం దెబ్బ పడింది. అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి ఇతర హీరోయిన్స్ కూడా రావడంతో పోటీ కూడా ఎక్కువ అయ్యింది. ఈ సమయంలోనే తమన్నా నైస్ గా సౌత్ సినిమాని పక్కన పెట్టి హిందీ సినిమాలోకి వెళ్ళింది. కాగా హిందిలో ఆమె వెళ్లడంతోనే ఊహించని బోల్డ్ పాత్రలు సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు కూడా చేసింది.

అలా క్రేజీ సర్ప్రైజ్ లు ఇచ్చిన తమన్నా అక్కడ తన లైఫ్ పార్ట్నర్ ని కూడా వెతుక్కోవడం జరిగింది. తమన్నా అందరికీ షాకిచ్చిన క్రేజీ అడల్ట్ చిత్రం లస్ట్ స్టోరీస్ 2 లో పక్కా బోల్డ్ సీన్స్ ని డైలాగ్స్ ని చేసేసి అదరగొట్టింది. మరి ఆ సినిమాలో తనకి జంటగా నటించిన హీరో నటుడు విజయ్ వెర్మ తోనే తన పర్శనల్ లైఫ్ ని కొనసాగించడం అనేది మొదలైంది.
తమ రిలేషన్ షిప్ ని ఎక్కడా దాచకుండానే ఉన్నంత కాలం ఇద్దరూ బయట కలిసే బాగా తిరిగేశారు. అంతే కాకుండా పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకోవడం కూడా ఒకింత వైరల్ గా కూడా మారడం జరిగాయి. కానీ ఏమయ్యిందో ఏమో కానీ ఇద్దరి నడుమ బ్రేకప్ వార్తలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరిపై మరిన్ని ఆసక్తికర కథనాలు మొదలయ్యాయి.
తమపై బ్రేకప్ వార్తలు వచ్చాక మళ్ళీ ఇద్దరు కలిసి ఎక్కడా కనిపించింది లేదు. ఇక మధ్యలో తమన్నా పరోక్షంగా కొన్ని కామెంట్స్ వదిలేది కానీ ఇపుడు మరోసారి ఇన్ డైరెక్ట్ గా విజయ్ విషయంలో కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇటీవల ఆమె చేసిన ఓదెల 2 సినిమా ప్రమోషన్స్ లో తనకి ఎదురైన ప్రశ్నకి సమాధానం ఇచ్చింది.
ఈ సినిమాలో ఎలాగో మంత్ర తంత్రాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ అవి ఉంటే నిజంగా ఎవరి మీద అయినా ప్రయోగిస్తారా అనే ప్రశ్నకి తమన్నా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. తమన్నాకి ఈ ప్రశ్న ఇన్ డైరెక్ట్ గా విజయ్ కోసమే అన్నట్టు అర్ధం అయ్యింది కానీ అందుకు బదులుగా తమన్నా క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. ఇలాంటి ప్రశ్నలు అడిగే వారి మీద ఆ మంత్రాలు ప్రయోగిస్తాను అని సెలవిచ్చింది.
దీనితో విజయ్ విషయంలో ఆమె వెనకేసుకొచ్చిందా లేక అతనితో పూర్తిగా తెగదెంపులు చేసేసుకున్నాక కూడా తనని ఇలాంటి ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారని అలాంటి వారి కోసం ఫైర్ అయ్యిందా అనే కన్ఫ్యూజన్ లో నెటిజన్స్ ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ విజయ్, తమన్నా బ్రేకప్ మాత్రం చాలా మందికి కొంచెం బాధ గానే అనిపించింది కానీ అక్కడ నుంచి ఇద్దరూ తమ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











