F3 మూవీ గెటప్‌తో తమన్నా భాటియా రచ్చ.. నాభి అందాలతో ఇన్స్‌టాగ్రామ్ రీల్ వైరల్
తమన్నా భాటియా తాజాగా విడుదలైన F3 సినిమా హిట్ ఎంజాయ్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా భాటియా హారిక అనే పాత్రలో మెరిసింది.. F 2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా అద్భుతమైన నటన ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేసింది. F3 హిట్ తో మంచి జోష్ మీద ఉన్న ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇన్స్‌టాగ్రామ్ రీల్ చేసి వదిలింది. ఆ వివరాల్లోకి వెళితే..

15 ఏళ్ల వయసులో
తమన్నా భాటియా మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఆమె తండ్రి ఒక వజ్రాల వ్యాపారి. అయితే చిన్నప్పటి నుంచి ఆమెకు నటన మీద ఆసక్తి ఏర్పడడంతో కేవలం 15 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె చేసిన చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమా హిందీ లో విడుదలైంది కానీ అది బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇక ఆమె అదే ఏడాది మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ అనే సినిమా ద్వారా తెలుగులో కేడి అనే సినిమా ద్వారా తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

హ్యాపీ డేస్ సినిమాతో
ఈ సినిమాలు ఆమెకు కలిసి రాలేదు. ఆ తర్వాత మరో తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించింది. కానీ 2007వ సంవత్సరంలో ఆమె చేసిన హ్యాపీ డేస్ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాలో ఆమె మధు అనే ఒక కాలేజ్ అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవసరం పడలేదు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.

వివాహం అంటూ
నిన్న నేడు రేపు, రెడీ, బద్రీనాథ్, ఊసరవెల్లి, 100% లవ్, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా, అల్లుడు శీను, ఆగడు, బాహుబలి, బెంగాల్ టైగర్, స్పీడున్నోడు, ఊపిరి, దేవి, అభినేత్రి, F2 వంటి సినిమాలు చేసింది. కెరీర్ లో కాస్త వెనుకబడింది అనుకుంటున్న సమయంలో ఆమె వివాహం చేసుకుంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

సినిమాను ప్రమోట్ చేస్తూ
ఈ విషయం మీద ఆమె ఎప్పుడూ నేరుగా స్పందించింది లేదు అడపాదడపా ఆమె వివాహం గురించి వార్తలు వస్తూ పోతూ ఉంటాయి. ఇక తాజాగా ఆమె F 3 అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్టరీ వెంకటేష్ సరసన హారిక అనే పాత్రలో ఆమె నటించి మెప్పించింది. తాజాగా ఆ సినిమాను ప్రమోట్ చేస్తూ తమన్నా ఒక రీల్ వదిలింది.
కుర్రాళ్ళను టీజ్ చేస్తూ
ఆ రీల్లో తొలుత చీర కట్టుకుని నాభి అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళను టీజ్ చేస్తూ ఒక గదిలోకి వెళ్ళింది. ఆ తర్వాత సినిమాలో చేసిన ఒక మగ పాత్రతో అఆమే మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. సినిమా చూసిన వారికి ఆ పాత్ర ఏమిటి అనే విషయం మీద క్లారిటీ వస్తుంది. ఇక ఆ రీల్ కు మిస్ బీ అండ్ వాళ్ళ బ్రో అంటూ కామెంట్ చేసింది. ఇక తమన్నా చేసిన రీల్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.


Click it and Unblock the Notifications











