ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న తమన్నా ఫొటోలు.. మళ్లీ ఇలా చూడటం కష్టమే!
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది. నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. దక్షిణాది ఆడియెన్స్ తోనే కెరీర్ ను నిలబెట్టుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన డ్యాన్స్ స్కిల్స్, బ్యూటీఫుల్ లుక్ తో సౌత్ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు అవార్డులను కూడా అందుకొని ప్రశంసలు పొందింది.
ఇదిలా ఉంటే.. తమన్నా భాటియా ప్రస్తుతం నార్త్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తనకు సమయం ఉన్నప్పుడుల్లా సౌత్ నుంచి వచ్చిన అవకాశాలను మాత్రం రిజెక్ట్ చేయకుండా ఆయా సినిమాల్లో నటిస్తూనే వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ తన గురించిన లేటెస్ట్ అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటోంది.

సినిమాల ద్వారా వెండితెరపై అలరిస్తూనే సోషల్ మీడియాలోనూ తన గురించిన అప్డేట్స్ ను అభిమానులతో ఎప్పటికప్పుడూ పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా మిల్క్ బ్యూటీ తన బ్యూటీఫుల్ లుక్స్ తో మెరుస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. రోజురోజుకు అందాన్ని పెంచేస్తూ చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఇక తాజాగా తమన్నా పంచుకున్న కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఒక్కో ఫొటోను చూస్తే తమన్నా పాలరాతి బొమ్మలాగే కనిపిస్తోంది. ఆమె అందానికి నిండు జాబిలమ్మే చిన్నబోయేలా ఉందంటే అతిశయోక్తి కాదు. తాజాగా అభిమానులతో షేర్ చేసుకున్న ఫొటోలను క్షణాల్లో లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేశారు.
వైట్ లాంగ్ గౌన్ లో మెరిసిన తమన్నా మరింత అందాన్ని సొంతం చేసుకుంది. తను ధరించిన గౌన్ పెన్సిల్ ఆర్ట్ ను కలిగి ఉండటం మరింత అట్రాక్షన్ ను చేకూర్చింది. దీంతో తమన్నా ఫ్యాషన్ సెన్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమ్మూ బేబీ సో క్యూట్ అంటూ పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. మరోవైపు తమన్నా మతులు పోయేలా ఫొటోలకు ఫోజులిచ్చి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.
ఇదిలా ఉంటే.. తమన్నా భాటియా ప్రస్తుతం 'ఓదెల 2' చిత్రంలో నటిస్తోంది. సంపత్ నంది ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కాగా ఈ చిత్ర యూనిట్ రీసెంట్ గానే కుంభమేళాను సందర్శించింది. త్రివేణి సంగమంపై టీజర్ ను లాంచ్ చేశారు. తమన్నా కూడా హాజరైంది. ఓదెల 2 ఇంకా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంటోంది. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇక తమన్నా నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్ ను కన్ఫమ్ చేయలేదు. దీంతో ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో పెళ్లికి రెడీ అవుతోందని మాత్రం గట్టగానే ప్రచారం జరుగుతోంది. అందుకే సినిమాల విషయంలో సైలెంట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











