7వ తరగతి పాఠ్యాంశంగా తమన్నా భాటియా జీవితం.. వివాదంలో మిల్కి బ్యూటీ.. కేసు నమోదు, నిరసనల హోరు
భారతీయ సినిమా రంగంలో తమన్నా భాటియా తన కెరీర్ ఆరంభం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్ర నటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అయితే సాధారణ స్థాయి నుంచి ఇండస్ట్రీలో సెలబ్రిటీగా మారినందుకు తమన్నా మతానికి చెందిన ఓ స్కూల్‌లో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం వివాదంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
తమన్నా భాటియా 1989లో డిసెంబర్ 21వ తేదీన మహారాష్ట్రలోని ఓ సింధీ కుటుంబంలో జన్మించింది. ఆమె తన 13వ ఏటనే అంటే 2005 సంవత్సరంలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీ అనే చిత్రం ద్వారాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన హ్యాపీ డేస్ చిత్రం ద్వారా పాపులారిటీ సాధించింది.

తమన్నా భాటియా తన 20 ఏళ్ల కెరీర్‌లో 80కి పైగా చిత్రాల్లో నటించింది. పలు వెబ్ సిరీస్, టెలివిజన్ షోలు, అలాగే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మెప్పించింది. ఇటీవల రిలీజైన లస్ట్ స్టోరీస్ 2 ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం వీడా, స్త్రీ 2, ఓదెల రైల్వే స్టేషన్ 2 సినిమాల్లో నటిస్తున్నది.
అయితే తమన్నా భాటియా సాధించిన ఘనతను దృష్టిలో పెట్టుకొని యువతకు స్పూర్తిగా నిలువాలనే అంశంతో బెంగళూరులోని హెబ్బా ప్రాంతంలోని సింధీ హై స్కూల్ యాజమాన్యం తమ పాఠ్య పుస్తకాల్లో ఓ పాఠంగా ఆమె జీవితాన్ని పొందుపరిచారు. అయితే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడంపై స్కూల్ పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదంగా మారింది.

తమన్నా జీవితాన్ని 7 తరగతి చెందిన పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడంపై సింధీ హై స్కూల్ యాజమాన్యంపై పేరెంట్స్ కమిటీ కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ , కర్నాటక అసోసియేట్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్‌లో ఫిర్యాదు చేశారు. ఇతర సంస్కృతికి చెందిన వారి జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం మాకు అభ్యంతరకరం అని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమన్నా వ్యవహారంపై పిల్లల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి నిరసన కూడా తెలిపారు. అలాగే అసభ్య, అశ్లీల సన్నివేశాల్లో నటించిన తమన్నా లైఫ్‌ను పిల్లలకు ఏ విధంగా స్పూర్తిదాయకంగా ఉంటుంది అని ప్రశ్నించినట్టు సమాచారం. పాఠ్యాంశాన్ని తొలగించకపోతే మా పిల్లలకు టీసీలు ఇవ్వాలని, మరో స్కూల్‌లో చేర్పించుకొంటామని హెచ్చరించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ పుస్తకంలో సింధీ మతానికి చెందిన రణ్‌వీర్ సింగ్ జీవితాన్ని కూడా పాఠ్యాంశంగా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











