For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tamannaah: పబ్లిక్‌లో బాయ్‌ఫ్రెండ్‌కు తమన్నా లిప్‌లాక్.. అడ్డంగా దొరికిపోయిన మిల్కీ బ్యూటి!

  |

  ఇంట్రడక్షన్ అవసరం లేని హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా. మంచు హీరో మనోజ్ శ్రీ సినిమా ద్వారా పరిచయం చేసిన ఈ గ్లామరస్ బ్యూటి సుధీర్ఘకాలంగా హీరోయిన్ గా హవా సాగిస్తోంది. ఇప్పటి వరకు ఎందరో స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈ బ్యూటి విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో అలరిస్తూ అభిమానులకు ఎంటర్టైన్ మెంట్ ఇస్తోంది. అయితే ఇటీవల తమన్నా ప్రేమాయణం, పెళ్లి వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని తమన్నా ఖండిస్తూ వచ్చింది. కానీ, ఈసారి మాత్రం అడ్డంగా బుక్కయింది ముంబై భామ తమన్నా.

  సౌత్ తో పాటు హిందీలో..

  సౌత్ తో పాటు హిందీలో..

  మోస్ట్ గ్లామరస్ బ్యూటి తమన్నా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా హ్యాపీ డేస్ తో యువత హృదయాలను కొల్లగొట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో సుమారు 50కిపైగా చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా ఆకట్టుకుంటూ తన సత్తా చాటుతోంది మిల్కీ బ్యూటి తమన్నా. ఇటీవల తెలుగులో వెంకటేష్ సరసన F3 సినిమాలో నటించి ఫన్ అందించింది.

  గ్లామరస్ బ్యూటిలలో..

  గ్లామరస్ బ్యూటిలలో..

  అలాగే నేరుగా ఓటీటీలో విడుదలైన బబ్లీ బౌన్సర్ సినిమాతో ఇటు తెలుగు అటు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడున్న గ్లామరస్ బ్యూటీలలో ఎక్కువ కాలం నిలదొక్కుకున్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లలో తమన్నా భాటియా ఒకరు. 2005లో తెలుగులో డెబ్యూ చేసిన ఈ బ్యూటి తన స్టార్ ఇమేజ్ తోనే ఇప్పటి వరకు అవకాశాలు అందుకుంటుంది.

   మంచి కంటెంట్ సినిమాలతో..

  మంచి కంటెంట్ సినిమాలతో..

  2005లో మంచు హీరో మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది తమన్నా. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంటూ వస్తోంది. మిల్కీ బ్యూటి తమన్నా మొదట్లో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలలో సెలెక్ట్ చేసుకుని తన స్టార్ డమ్ స్టేటస్ ను పెంచుకుంది. ఇక తర్వాత మెల్లిగా మీడియం బడ్జెట్ సినిమాలు ఆ తరువాత బిగ్ బడ్జెట్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ వచ్చింది.

  మేల్ గెటప్ చూపించి..

  మేల్ గెటప్ చూపించి..


  ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటిఫుల్ తమన్నాకు గత కొంత కాలంగా రూమర్స్ బెడద అంటుకుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయితో డేటింగ్ చేస్తోందని వార్తలు కాగా ఓ ఇంటర్వ్యూలో ఖండించింది. అలాగే ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు F 3 సినిమాలో మేల్ గెటప్ ను చూపించి అతడే తనకు కాబోయే భర్త అని చెప్పి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.

  గోవాలో న్యూ ఇయర్ వేడుకల్లో..


  అయితే ఇప్పుడు మాత్రం తమన్నా చాలా గట్టిగానే దొరికిపోయింది. తమన్నా పాపులర్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా వీళ్లిద్దరు చాలాసార్లు కమెరాకు చిక్కారు. దీంతో విజయ్ వర్మ-తమన్నా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలకు గట్టి పునాది పడింది. ఇప్పుడు గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మరోసారి ఈ జంట కనిపించింది.

  విలన్ కు లిప్ లాక్..

  పబ్లిక్ లో విజయ్ వర్మకు ముద్దులు పెడుతూ, హగ్ లు ఇస్తూ రెచ్చిపోయింది మిల్కీ బ్యూటి. నటుడు విజయ్ వర్మకు తమన్నా లిప్ లాక్ ఇచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు వీటికి తమన్నా ఏం సమాధానం చెబుతుందో అని నెటిజన్లు అనుకుంటున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేశ్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

  సైకో భర్తగా విజయ్ వర్మ..

  భోళా శంకర్ సినిమానే కాకుండా లస్ట్ స్టోరిస్ 2 వెబ్ సిరీస్ లో కూడా తమన్నా నటిస్తోంది. ఇందులో విజయ్ వర్మ కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక నటుడు విజయ్ వర్మ.. నేచురల్ స్టార్ నాని నటించిన ఏసీఏ సినిమాలో విలన్ గా చేశాడు. అలియా భట్ డార్లింగ్స్ సినిమాలో సైకో భర్తగా అలరించాడు. మీర్జాపూర్ రెండో సీజన్, షీ వెబ్ సిరీస్ లో కూడా ఆకట్టుకున్నాడు.

  English summary
  Milky Beauty Tamannaah Bhatia Lip Kiss To MCA Movie Actor Vijay Varma In Goa New Year Celebrations And Pics Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X