Tamannaah Bhatia జైలర్ పాటలో తమన్నా శృంగార విన్యాసాలు.. ఆ స్టెప్పులతో చంపేసిందిగా..
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న జైలర్ చిత్రం నుంచి తొలి పాటను ప్రేక్షకులు, అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పాటను రిలీజ్ చేయగానే ట్రెండింగ్‌గా మారింది. మంచి మాస్, మసాలతో రూపొందిన కావాలా పాటలో తమన్నా భాటియా వేసిన స్టెప్పులపై హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. ఈ పాట వివరాల్లోకి వెళితే..
జైలర్ చిత్రంలో ఊర మాస్ సాంగ్ కావాలా పాటను శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫిని అందించారు. చాలా మంది గ్రూప్ డ్యాన్సర్లతో ఈ పాటను తమన్నా భాటియా, రజనీకాంత్‌పై చిత్రీకరించారు. రజనీకాంత్‌తో తమన్నా కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ అభిమానుల్లో వినిపించింది.

జైలర్‌లోని కావాలా లిరికల్ వీడియోలో అంగాంగ ప్రదర్శన, శృంగార విన్యాసాలతో తమన్నా భాటియా రెచ్చిపోయింది. శరీరాన్ని ఊపేస్తూ తనలోని రొమాంటిక్ కోణాన్ని బయటపెట్టింది. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన పాటపై ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులు, నడుము ఒంపులతో పాటను హాట్‌గా మార్చి వేసింది.
జైలర్‌లోని కావాలా పాటలో తమన్నా భాటియా హాట్‌గా కనిపించింది. బికినీ తరహా డ్రస్సులో అందాలను ఆరబోసింది. అందంగా డిజైన్ చేసిన రింగుల జట్టుతో మరింత అందంగా కనిపించింది. ఐటమ్ నంబర్ మాదిరిగా కనిపించిన ఈ పాటలో తమన్నా పక్కన రజనీకాంత్ తనదైన స్టైయిల్‌లో కళ్ల జోడును పెట్టుకొని అదరగొట్టేశాడు.
జైలర్ సినిమా ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఈ చిత్రంలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యోగిబాబు, వసంత రవి, రవి వినాయక్ తదితరులు నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











