Tamannaah Net Worth: తమన్నా అధికారిక ఆస్తులు ఎన్ని కోట్లు.. మిల్కి బ్యూటీ కోట్లాది సంపద ఎలా అంటే?

Tamannaah Bhatia Net Worth : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళం,హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ.. తనని తాను అప్డేట్ చేసుకుంటూ బిజీ స్టార్‌గా కొనసాగుతోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు,స్పెషల్ సాంగ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టి తన బ్రాండ్ వాల్యూ పెంచుకుంది.

దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న తమన్నా భారీగా సంపాదించినట్టు తెలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం.. తమన్నా నికర ఆస్తి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉందట. ఈ సంపద కేవలం సినిమాల ద్వారా వచ్చినది మాత్రమే కాదు. తాను సంపాదించిన డబ్బును పలు రంగాల్లో పెట్టుబడులుగా మార్చుకుంటూ తన ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తుంది.

Tamannaah Bhatia Net Worth Rs 100 Crore Wealth Luxury Home Cars Business Income

తమన్నా సిర్థాస్తుల విషయానికి వస్తే.. ముంబైలోని జూహు-వెర్సోవా లింక్ రోడ్‌లో ఉన్న'బే వ్యూ' అపార్ట్‌మెంట్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్ ఉంది. దీనిని విలువ సుమారు రూ.16 కోట్లు ఉంటుందట. అలాగే, ముంబైలో మరో ప్రీమియం అపార్ట్‌మెంట్ కూడా ఆమెకు ఉందట. ఇక తన గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ GLE, బీఎమ్‌డబ్ల్యూ 320i, మిత్సుబిషి పజెరో స్పోర్ట్ వంటి హై రేంజ్ కార్లు ఉన్నాయి.

ఇక పారితోషికం విషయంలో కూడా తమన్నా టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అలాగే ఐటెం సాంగ్స్, స్టేజ్ షోలు, లైవ్ ఈవెంట్స్ ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తోందట. అంతేకాదు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం ఒక్కో ప్రకటనకు కోటికి పైగా తీసుకుంటున్నట్లు సమాచారం.

సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ తమన్నా తన ముద్ర వేసింది. ప్రముఖ బ్యూటీ బ్రాండ్ షుగర్ కాస్మెటిక్స్ ( SUGAR Cosmetics )లో ఆమె కూడా పార్టనర్ అని తెలుస్తోంది. అలాగే.. వైట్ అండ్ గోల్డ్ ( White & Gold ) పేరుతో జ్యువెలరీ బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది. నటనతో వచ్చిన ఆదాయాన్ని వ్యాపారాల్లో పెట్టుబడిగా మార్చుకుంటూ తన సంపదను మరింత పెంచుకుంటోంది.

అంతేకాదు.. సోషల్ మీడియాలో కూడా తమన్నాకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లాది మంది అభిమానులు ఆమె సొంతం. దీంతో బ్రాండ్ ప్రమోషన్లు, డిజిటల్ క్యాంపెయిన్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.వీటి ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదన ఆర్జీస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే, ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ డబ్బే తన జీవితంలో అంతిమ లక్ష్యం కాదని, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలు పోషించడం, సమాజంపై సానుకూల ప్రభావం చూపే పాత్రలు చేస్తూ.. తన కేరీర్ లో ముందుకు సాగాలని కోరుకుంటానని తమన్నా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X