తమన్నా భాటియా రెమ్యునరేషన్.. 2025 వరకు ఎన్ని వందల కోట్లు సంపాదించిందో తెలుసా?

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు ఊపూపింది మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిల పోటీల పెరుగుతున్న కారణంగా తమన్నా భాటియా కూడా కాస్తా రూటు మార్చి ఇంట్రెస్టింగ్ అండ్ బోల్డ్ కంటెంట్స్ తో అందరినీ ఆశ్చర్య పరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా సందడి చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది.

ఇక ఇవ్వాళ తమన్నా భాటియా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిసారిగా తమన్నా భాటియా నాగ సాధువుగా అలరించేందుకు సిద్ధమైంది. రామ్ చరణ్ - తమన్నా నటించిన 'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నందినే ఓదెల 2 చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. కథను కూడా ఆయనే అందించారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ హైప్ ను పెంచాయి. ఎర్లీ రివ్యూ కూడా సినిమాను ఆకాశానికి ఎత్తాయి. దీంతో తమన్నా భాటియాకు భారీ హిట్ పడిందని తెలుస్తోంది.

Tamannaah Bhatia Odela 2 Remuneration

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తమన్నా భాటియా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. తెలుగులో కాస్తా తక్కువే అయినా.. హిందీలో మాత్రం దుమ్ములేపుతోంది. బోల్డ్ పాత్రల్లోనూ నటించి ఆడియెన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసింది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వంటి సిరీస్ ల్లో తమన్నా పెర్ఫామెన్స్ ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. అలాగే అఖ్రీ సచ్, స్త్రీ 2, వేదా వంటి చిత్రాలతోనూ బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేసింది. ఇలా చేతి నిండా సినిమాలో ఫుల్ బిజీగా ఉంటోంది తమన్నా.

అయితే ప్రస్తుతం తమన్నా భాటియా ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నదనేది ఆసక్తికరంగా మారింది. తమన్నా భాటియా రూ.5 కోట్ల వరకు ఛార్జి చేస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. ఇక ఓదెల 2 చిత్రానికి కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. మరోవైపు తమన్నా ఆస్తుల నికర విలువ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. తమన్నాకు ముంబైలో లగ్జీరీ అపార్ట్ మెంట్ లు ఉన్నాయి. ముంబైలోని వెర్సోవా లో 14వ ఫ్లోర్ లో ఒక అపార్ట్ మెంట్ ను కలిగింది. అలాగే రూ.7.84 కోట్ల విలువ చేసే మూడు అపార్ట్ మెంట్లు లోఖండ్వాలాలో ఉన్నాయి.

తమన్నా తను సినిమాల్లో సంపాదించిన డబ్బులను ఎక్కువగా రియలెస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా తిరిగి రెట్టింపు స్థాయిలో లాభాన్ని పొందుతుంది. ఇక తమన్నాకు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. రూ.43.50 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ 320i, రూ.1.02 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, రూ.30 లక్షల విలువ గల పాజారో స్టోర్, రూ75.59 లక్షల విలువ గల ల్యాండ్ రేంజ్ రోవర్ కార్లు కూడా తమన్నా భాటియా కార్ గ్యారేజీలో ఉన్నాయని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ఇలా మొత్తంగా తమన్నా ఆస్తుల విలువ రూ.120 కోట్ల వరకు ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X