Lust Stories 2 ఆ సీన్లు ఉంటే టీవీ ఆఫ్ చేయకండి.. లస్ట్ స్టోరీస్‌ 2లో ఆ కంటెంట్ కూడా ఎక్కువే.. తమన్నా

గతంలో నెటిఫ్లిక్స్‌లో విశేషంగా ఆదరణ పొందిన లస్ట్ స్టోరీస్ ఆంథాలజీకి కొనసాగింపుగా వస్తున్న వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ వెబ్ మూవీలో తమన్నా భాటియా, మృణాల్ థాకూర్, కాజోల్, విజయ్ వర్మ తిలోత్తమ షోమే, ఆంగద్ బేడీ, అనుష్క కౌశిక్, కుముద్ మిశ్రా, నీనా గుప్తా, అమృతా సుభాష్, అంజుమన్ సక్సేనా తదితరులు నటించారు. ఈ వెబ్ అంథాలజీ జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సందర్భంగా విడుదలైన ప్రోమోలో తమన్నా భాటియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే.

లస్ట్ స్టోరీస్ 2 వెబ్ అంథాలజీలోని కథలకు ప్రముఖ దర్శకులు ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణాసేన్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అషి దువా, రోని స్కృవాలా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మంచి హాట్, ఫ్యామిలీ కంటెంట్‌తో రూపొందిన ఈ వెబ్ అంథాలజీకి మంచి క్రేజ్ ఏర్పడింది.

 Tamannaah Bhatia

లస్ట్ స్టోరీస్ 2 సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్లు మంచి రెస్పాన్స్ కూడగట్టుకొన్నాయి. ఈ చిత్రంలో తమన్నా, మృణాల్ థాకూర్ నటించిన సన్నివేశాలపై భారీగా చర్చ జరిగాయి. శృంగారపరమైన సన్నివేశాల్లో వీరిద్దరూ హాట్ హాట్‌గా నటించారు. ఈ సందర్బంగా తమన్నా ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ..

 Tamannaah Bhatia

లస్ట్ స్టోరీస్ 2 మూవీ చూస్తున్నప్పుడు మీ గదిలోకి ఎవరైనా వస్తే మీరు భయపడి టీవీ ఆఫ్ చేయకండి. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలే కాదు.. అమ్మ, అమ్మమ్మ ప్రేమ, అన్న, మాజీ ప్రియుడు ప్రేమ, కుటుంబ మధ్య బంధాలు అన్నీ ఉంటాయి. పేరు చూసి భయపడకండి. అందరికీ చూపించండి అని తమన్నా భాటియా అన్నారు.

 Tamannaah Bhatia

లస్ట్ స్టోరీస్ 2 సినిమా చూసినంత మాత్రాన ఆకాశం విరిగి మీదపడదు. భూమి బద్దలైపోదు. వైఫై ఆగిపోదు. అలా ఆందోళన చెందితే.. మనసు పాడైపోతుంది. కాబట్టి దయచేసి లస్ట్ స్టోరీస్ 2 సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి అని తమన్నా భాటియా ప్రోమోలో వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X