Tamannaah: భరించలేకపోయా.. ఆ ఘటనతో వెక్కి వెక్కి ఏడ్చా .. తమన్నా కామెంట్స్ వైరల్
Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు తమన్నా భాటియా . ఈ మిల్క్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. వరుస విజయాలను అందుకని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఆ స్టార్ డమ్ తోనే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ కూడా తన అందం, అభినయంతో నార్త్ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇటీవల తాజాగా ఓ షూటింగ్ లో జరిగిన అసహ్యకర సంఘటన గురించి తమన్నా పంచుకున్నారు. ఆ సంఘటన నుండి ఎలా కోలుకున్నానో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు నటించిన 'శ్రీ' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడుకు హ్యాపీడేస్ సినిమాతో మంచి బ్రేక్ లభించింది. రెడీ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు .. ఇలా వరుస సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకుని తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఇలా అనతి కాలంలోనే తెలుగు సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇలా టాప్ హీరోల సరసన సౌత్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది తమన్నా. రజినీకాంత్ 'జైలర్' మూవీలో 'కావాలయ్యా..'అనే స్పెషల్ సాంగ్ తో రెచ్చిపోయింది. గ్లామర్ షో తో టాక్ ఆఫ్ దీ సెన్సేషన్ గా మారింది. ఆ తరువాత ఈ మిల్క్ బ్యూటీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. స్ట్రీ 2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి, కుర్రవాళ్లకు చెమటలు పట్టించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలు,వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టింది. ఈ వెబ్ సిరీస్ ల్లో తన గ్లామర్ షో చేస్తుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 19 ఏండ్లు అవుతున్నా తమ గ్లామర్ ఏమాత్రం చెక్కు చెదరలేదు.
ఇటీవల హీరోయిన్ తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కారవాన్‌లో జరిగిన అసహ్యకర సంఘటన గురించి తమన్నా పంచుకున్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్ సమయంలో కారవాన్‌లో జరిగిన ఘటనను గుర్తుకు చేసుకుంటూ.. భావోద్వేగానికి లోనైంది. కళ్ళలో కన్నీళ్లు ఉప్పొంగుతున్నట్లు గుర్తుచేసుకుంది. ఆ ఘటనతో తనని తాను భావోద్వేగాలను నియంత్రించుకోవాలని తమన్నాభాటియా వెల్లడించింది.

సినిమా షూటింగ్ కోసం కారవాన్‌లో ఉన్నప్పుడు తనకు ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపారు. భరించలేని దుఃఖాన్ని అనుభవించానని నటి తమన్నా తెలిపారు. ఆ సంఘటన తనని వెక్కి వెక్కి ఏడ్చేలా చేసిందనీ, తాను మేకప్ వేసుకుని ఉండటం వల్ల ఏడవలేకపోయానని ఆమె చెప్పింది. కష్టమైన భావోద్వేగం నుండి నెమ్మదిగా బయటపడ్డాననీ, తర్వాత తనని తాను అద్దంలో చూసుకున్నాననీ, తాను నాకు ఓదార్పుకున్నానని తెలిపింది.


Click it and Unblock the Notifications











