ఇద్దరితో రిలేషన్ బ్రేకప్.. అయినా డోంట్ కేర్ అంటున్న స్టార్ హీరోయిన్.. .

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల మద్య లవ్ అఫైర్స్, డేటింగ్, బ్రేకప్స్, మ్యారేజ్ ఇవన్నీ సాధరణం. ఇలాంటి విషయాలే సెలబ్రెటీలకు మరింత పబ్లిసిటిని తెచ్చిపెడుతాయి. అలా పాపులర్ అయిన సెలబ్రెటీలు కూడా ఇటు టాలీవుడ్ లోనూ..అటు బాలీవుడ్ లోనూ చాలా మందే ఉన్నారు. వారు తమ కో స్టార్స్ తోనే లేదా ఇతర వ్యక్తులతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్ లో బాగా పాపులర్ అయినారు. మరికొందరు రిలేషన్ షిప్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అందరి రిలేషన్స్ సక్సెస్ కావు.. అయినా పెళ్లిళ్ల వరకు వెళ్లావు. ఓ స్టార్ హీరోయిన్ ఇప్పటి వరకూ తనకు 2 సార్లు బ్రేకప్ అయ్యిందనీ, అయినా అంత మన మంచికే అంటుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఓ లూక్కేయండి.

ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు... టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. ఈ మిల్కీ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా.. పలు సినిమాల్లో నటిస్తూ.. దూసుకుపోతుంది. ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఓటీటీలో కూడా అగుడుపెట్టి తన సత్తా చాటుకుంది. ఈ బ్యూటీ మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'శ్రీ' అనే మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తరువాత శేఖర్ కమలా డైరెక్షన్ లో వచ్చిన 'హ్యాపీ డేస్'అనే మూవీలో నటించి మెప్పించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

Tamannaah Bhatia opens up about her two failed love relationships

మిల్కీ బ్యూటీ వరుస అవకాశాలు దక్కించుకుంది. వరుస హిట్స్ అందుకోవడంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇటీవల ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీలో 'కావాలయ్యా..'అంటూ రెచ్చిపోయి.. గ్లామర్ షో లో టాక్ ఆఫ్ దీ సెన్సేషన్ గా మారింది. అలాగే.. బాలీవుడ్ కూడా దూసుకుపోతుంది ఈ అమ్మడు. స్ట్రీ 2 సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ నటించి తన అందాల ఆరబోతతో బీ టౌన్ ప్రేక్షకులకు చెమటలు పట్టించింది.

రీసెంట్ గా సికందర్ కా ముఖద్దర్ (Sikandar Ka Muqaddar)అనే మూవీలో తమన్నా లీడ్ లో నటించింది. ఈ మూవీకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 29నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ మూవీ తరువాత.. 'ఓదెల 2' అనే మూవీలో ఈ మిల్కీ బ్యూటీ ప్రధాన పాత్రలో నటిస్తుంది. గతంతో ఈషా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన హిట్‌ మూవీ 'ఓదెల రైల్వేస్టేషన్‌' (2021)కి సీక్వెల్‌గా 'ఓదెల 2' వస్తుంది. ఈ సినిమాతో పాటు కరణ్‌ జోహార్‌ బ్యానర్‌పై రూపొందుతున్న 'డేరింగ్‌ పార్ట్‌నర్స్‌'లో కూడా నటిస్తోంది.

Tamannaah Bhatia opens up about her two failed love relationships

ఇదెలా ఉంటే.. మిల్క్ బ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న చెరగని అందం ఆమె సొంతం.. ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో నటుడు విజయ్ వర్మతో లవ్ ట్రాక్ నడుపుతోందని బీ టౌన్ లో జోరుగా సాగుతోంది. త్వరలో వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న తమన్నా.. తన పర్సనల్ లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. జీవితంలో తాను కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని , లైఫ్‌లోని రెండు లవ్ స్టోరీస్ గురించి ఓపెన్ అప్ అయింది మిల్కీ బ్యూటీ. అయితే.. అవి రెండు ఫెల్యూర్ స్టోరీలేనని తెలిపింది.

తాను టీనేజ్ లో ఉన్నప్పుడే తొలిసారి ప్రేమలో పడ్డానని, అప్పుడు మెచ్యూరిటీ లేక తన లవ్ ని వదిలేసానని చెప్పుకొచ్చారు. మరోటి మాత్రం హీరోయిన్‌గా తన కెరీర్ మంచి స్టేజ్ తో ఉన్నప్పుడు తాను ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని, కానీ, ఆ వ్యక్తి కోసం తన ఇష్టమైన జీవితాన్ని తాను వదులుకోలేననీ, అలాగే తనతో లాంగ్ టైమ్ రిలేషన్ వర్కవుట్ కాదని బ్రేకప్ చేసుకున్నట్టు తెలిపింది మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇలా తన లైఫ్ లో రెండు సార్లు హార్ట్ బ్రేక్ అయిందని తెలిపింది.

More from Filmibeat

Read more about: tamannaah bhatia vijay verma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X